/rtv/media/media_files/2025/03/02/pI4htvUyrn8gp2lJ5a0M.jpg)
Key Update on Group Exams Results
తెలంగాణలో ఇటీవల గ్రూప్-1,2,3 పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఫలితాలు ఎప్పుడొస్తాయా అని అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే గ్రూప్ ఫలితాలపై తాజాగా ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. టీజీపీఎస్సీ.. ముందుగా గ్రూప్-1 మెయిన్స్ జనరల్ ర్యాంకింగ్ జాబితాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మార్చి 10వ తేదీలోగా ఈ లిస్ట్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం.
Also Read: రైతులకు రూ.5కే శాశ్వత విద్యుత్ కనెక్షన్.. సీఎం కీలక ప్రకటన
ఆ తర్వాత టీజీపీఎస్సీ గ్రూప్ 2,3 ఫలితాలను ప్రకటించనుంది. 2,374 పోస్టుల భర్తీ కోసం గ్రూప్-1,2,3 పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 5,51,247 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో చెప్పిన జాబ్ క్యాలెండర్‌పై దృష్టి పెట్టింది. ఈ మేరకు ఈ ఏడాది మే నుంచి కొత్త ఉద్యోగాల ప్రకటనలకు టీజీపీఎస్సీ కసరత్తులు చేస్తోంది.
Also Read: 4వేల ఎకరాల్లో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి - 80కి పైగా భవనాలు దగ్ధం..!
మార్చి 31 నాటికి రాష్ట్రంలో అన్ని శాఖల్లో ఉన్న ఖాళీల సంఖ్యను అందజేయాలని తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాస్తామని ఇటీవలే టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. ఈ క్రమంలోనే ఏప్రిల్‌లో ఈ అంశాలపై చర్చిస్తామన్నారు. మే 1 నుంచి నోటిఫికేషన్లు జారీ చేస్తామని చెప్పారు.
Also Read: కేసీఆర్ వల్లే SLBC టన్నెల్ కూలింది.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Also Read: ట్రంప్ దెబ్బకు అబ్బా అంటున్న ట్రాన్స్‌జెండర్లు.. భారత్‌లోనూ మూతపడ్డ ఆ క్లినిక్‌లు!