/rtv/media/media_files/2024/12/23/uO6emXl66VmwXmbCqQ0R.jpg)
Garikipati Narasimha Rao on allu arjun
Garikipati Pushpa 2 : అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అల్లు అర్జున్ నిర్లక్ష్యం కారణంగానే ఓ నిండు ప్రాణం పోయిందని.. ఘటనకు మరో వెర్షన్ ని కూడా వినిపించడం మరింత హాట్ టాపిక్ గా మారింది. దీంతో అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో భారీగా పోస్టులు పెడుతున్నారు నెటిజన్ల. మరోవైపు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో ఘటన సంబంధించి చెప్పిన సమాదానాలకు, థియేటర్ దగ్గర ఆయన చేసిన దానికి ఏ మాత్రం పొంతన లేనట్లుగా వీడియోలు వైరల్ కావడం చర్చనీయాంశంగా మారింది. బన్నీ అబద్ధాలు చెబుతున్నాడంటూ నెటిజెన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.
Also Read: అల్లు అర్జున్ నువ్వు చేసింది తప్పే.. కమెడియన్ రాహుల్ సంచలన ట్వీట్
తగ్గేదేలే అంటావా..
ఈ క్రమంలో గతంలో ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నర్సింహారావు 'పుష్ప 2' సినిమాపై మండిపడుతూ చేసిన వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. "తగ్గేదెలా అంటావా.! రేపు ఓ పిల్లవాడు ఎవరినైనా కొట్టి తగ్గేదెలా అంటాడు.. దానికి ఎవరు బాధ్యులు? తగ్గేదెలా అని ఒక హరిశ్చంద్రుడు లాంటి వారు అనాలి.. అంతేకాని ఒక స్మగ్లర్ అనడమేంటి! దీని వల్ల సమాజంలో నేరాలు పెరిగిపోతాయి. ఆ హీరోని, డైరెక్టర్ నా ముందుకు రమ్మను కడిగిపారేస్తాను" అంటూ వీడియోలో గరికపాటి మండిపడ్డారు. కాగా, ఈ వీడియోను నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.
ఇచ్చి పడేచారు గురువు గారు
— Geetha vijaya ™️ 😍✌️ (@geetha_happy2) December 22, 2024
🤣🤣pic.twitter.com/VQgTDdqn12
గరికపాటి మాత్రమే కాదు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా పుష్ప2 పై విమర్శలు చేశారు. ఇటీవలే సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ వాడెవడో ఎర్రచందనం దొంగ వాడు హీరోనట అని అన్నారు. మంత్రి సీతక్క కూడా ఫైర్ అయ్యారు. హక్కులు కాపాడే పోలీస్, లాయర్ జీరో.. స్మగ్లింగ్ చేసే వాడు హీరో ఎలా అవుతాడు? అంటూ ఘాటు విమర్శలు చేశారు.
ఇది కూడా చదవండి: అల్లు అర్జున్ కు బిగుసుకుంటున్న ఉచ్చు.. మరికొద్ది సేపట్లో ఏసీపీ కీలక ప్రెస్ మీట్!
Also Read: Hansika: హన్సిక అందాలు అదుర్స్.. డిజైనర్ లెహంగా, భారీ నెట్ సెట్ తో స్టన్నింగ్ ఫోజులు!