అల్లు అర్జున్ నువ్వు చేసింది తప్పే.. కమెడియన్ రాహుల్ సంచలన ట్వీట్

నటుడు రాహుల్ రామకృష్ణ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ కు మద్దతుగా చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. తనకు వచ్చిన తప్పుడు సమాచారం కారణంగానే గతంలో అలాంటి ట్వీట్ చేశానని వెల్లడించారు.

New Update

Rahul  Ramakrishna:  గత వారం రోజులుగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పేరు మారుమోగిపోతోంది. ఎక్కడా చూసిన సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించిన  వీడియోలే కనిపిస్తున్నాయి. ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా  అసెంబ్లీ వేదికగా సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ తీరుపై నిప్పులు చెరిగారు. ఆయన నిర్లక్ష్యం కారణంగానే నిండు ప్రాణం పోయిందని ఫైర్ అయ్యారు. 

Also Read: CV Anand Apology: అల్లు అర్జున్ ఇష్యూలో బిగ్ ట్విస్ట్.. సారీ చెప్పిన హైదరాబాద్ సీపీ!

బన్నీ తప్పు చేశాడు.. 

అయితే ఈ ఘటనలో అల్లు అర్జున్ ని అరెస్టు చేసినప్పుడు ఎంతో మంది సినీ సెలెబ్రెటీలు ఆయనకు మద్దతుగా ట్వీట్లు చేశారు. ఆ సమయంలో కమెడియన్ రాహుల్ రామకృష్ణ కూడా బన్నీ మద్దతుగా..  ప్రభుత్వానికి అనేక ప్రశ్నలు సంధిస్తూ ట్వీట్ చేశారు.  కాగా, తాజాగా మరో సంచలన ట్వీట్ చేశారు. తాను అల్లు అర్జున్ కి మద్దతుగా చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు పోస్ట్ పెట్టారు. జరిగిన సంఘటన పై తనకు తప్పుడు సమాచారం రావడం వల్లే బన్నీకి మద్దతుగా మాట్లాడానని. ఇప్పుడు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని స్పష్టం చేశారు.

గతంలో రాహుల్ రామకృష్ణ ట్వీట్.. 

గతంలో రాహుల్ తన ట్వీట్ లో ఇలా రాసుకొచ్చాడు.. సంధ్య థియేటర్ వద్ద జరిగిన సంఘటన దురదృష్టకరం. కానీ.. లా అండ్ ఆర్డర్ వైఫల్యం ఒక వ్యక్తి చేసిన తప్పు ఎలా అవుతుంది.? అని ప్రశ్నించారు. సెలెబ్రెటీలు పబ్లిక్ ప్రదేశాలకు హాజరయ్యేటప్పుడు పోలీసులు మరింత జాగ్రత్తగా ఉండాలి. సినిమా స్థాయిని గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. జనం ఎక్కువగా వస్తారని తెలిసి జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు.. అంతమందిని  ఒకేసారి లోపలికి  ఎందుకు అనుమతించారు? అని అన్నారు. మతపరమైన ఊరేగింపులు, రాజకీయ పార్టీల తొక్కిసలాటలో ఎంతో మంది మరణించినప్పుడు.. ఇంతే వేగంగా ఎందుకు స్పందించరు? సినిమా విషయంలో ఇంత వేగంగా ఎందుకు స్పందిస్తున్నారు ? అని ట్వీట్ చేశారు.  

Also Read: Hansika: హన్సిక అందాలు అదుర్స్.. డిజైనర్ లెహంగా, భారీ నెట్ సెట్ తో స్టన్నింగ్ ఫోజులు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు