/rtv/media/media_files/2024/12/17/yearender51.jpeg)
ఈ వ్యాధులు వ్యాప్తి దేశంలోని మిలియన్ల ప్రజలను ప్రభావితం చేసింది. అంతేకాదు ప్రపంచ ఆరోగ్య వ్యవస్థ పై కూడా తీవ్ర ఒత్తిడిని కలిగించాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
/rtv/media/media_files/2024/12/17/yearender1-11.jpeg)
మంకీ పాక్స్
2024లో బయటపడిన మంకీ పాక్స్ వైరస్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలను వణికించింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ ప్రకారం.. 2024 జూన్ 12 నాటికి ప్రపంచవ్యాప్తంగా 97,281 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి.
/rtv/media/media_files/2024/12/17/yearender1.jpeg)
దీనిని ఒక అంటూ వ్యాధిగా గుర్తించారు. ఈ వ్యాధి కారణంగా 208 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆఫ్రికా, ఐరోపా, ఆసియా దేశాల్లో ఈ వ్యాధి వ్యాపించింది.
/rtv/media/media_files/2024/12/17/yearender41.jpeg)
డెంగ్యూ
డెంగ్యూ జ్వరం 2024లో ఆసియా, దక్షిణ అమెరికా, ఆఫ్రికాలో దేశాల్లో ఎక్కువగా వ్యాపించింది. ఆసియా ఖండంలోని దేశాల్లో తీవ్ర వర్షాల కారణంగా డెంగ్యూ కేసులు పెరిగాయి.
/rtv/media/media_files/2024/12/17/yearender51.jpeg)
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. 2024 ఏప్రిల్ 30 నాటికి 7.6 మిలియన్లకు పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. 3000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
/rtv/media/media_files/2024/12/17/yearender21.jpeg)
కోవిడ్ 19 XBB వేరియంట్
2024లో మరోసారి కరోనా కలకలం రేపింది. కరోనా కొత్త వేరియంట్ XBB ప్రపంచవ్యాప్తంగా ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఈ వేరియంట్ కోవిడ్ వాక్సిన్ ప్రభావాన్ని తగ్గించడమే కాకుండా చాలా మంది ప్రాణాలు కోల్పోయేలా చేసింది. ఇది చిన్నపిల్లలు, వృద్ధుల పై ఎక్కువగా ప్రభావం చూపింది.
/rtv/media/media_files/2024/12/17/yearender61.jpeg)
నిపా వైరస్
కేరళ రాష్ట్రంలో నిపా వైరస్ వ్యాప్తి ఎక్కువగా కనిపించింది. ఈ వ్యాధి గబ్బిలాలు, పందుల ద్వారా వ్యాప్తి చెందుతుందని గుర్తించారు. ఇది కూడా ఒక రకమైన అంటు వ్యాధి. దీని కారణంగా కేరళలో ఎంతో మంది చనిపోయారు.
/rtv/media/media_files/2024/12/17/yearender81.jpeg)
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.