Diwali Movies: బాక్సాఫీస్ పోరులో 'డ్యూడ్' vs 'తెలుసు కదా'.. గెలిచేదెవరు..?

అక్టోబర్ 17న విడుదలవుతున్న 'తెలుసు కదా'కి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ బిజినెస్ జరగగా, 'డ్యూడ్'కి ఓవర్సీస్, తమిళనాడు, ఇతర ప్రాంతాల్లో భారీ రేస్పాన్స్ వచ్చింది. వరల్డ్‌వైడ్‌గా ‘డ్యూడ్’ రూ.59 కోట్లు, ‘తెలుసు కదా’ రూ.22 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసాయి.

New Update
Diwali Movies

Diwali Movies

Diwali Movies: ఈ దీపావళి సీజన్‌లో రెండు మిడ్ రేంజ్ సినిమాలు థియేటర్లలో పోటీపడనున్నాయి. ఒకవైపు సిద్ధూ జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) నటిస్తున్న "తెలుసు కదా"(Telusu Kada Movie), మరోవైపు తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) "డ్యూడ్"(Dude Movie) సినిమాలు అక్టోబర్ 17న విడుదలవుతున్నాయి. ఈ రెండు సినిమాల మధ్య బిజినెస్ పరంగా ఆసక్తికరమైన పోటీ నెలకొంది.

Also Read: ‘బాహుబలి: ది ఎపిక్’ సెన్సార్ పూర్తి.. రన్‌టైమ్‌ ఎంతంటే..?

తెలుగు రాష్ట్రాల్లో టిల్లుగాడే ముందున్నాడు!

తెలుగులో ప్రదీప్‌కు “లవ్ టుడే” వంటి సినిమాల వల్ల ఓ స్థాయి ఫాలోయింగ్ ఏర్పడినప్పటికీ, తెలుగు బిజినెస్ పరంగా మాత్రం సిద్ధూ సినిమా ‘తెలుసు కదా’ ఆధిపత్యం చూపుతోంది. ఈ సినిమాకు రూ.16.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరుగగా, ‘డ్యూడ్’కు కేవలం రూ.10 కోట్లు మాత్రమే ఉంది. గతంలో ‘జాక్’ సినిమాతో ఫ్లాప్ అయినా కూడా సిద్ధూ క్రేజ్ తగ్గలేదు.

Also Read: రీ-రిలీజ్ కి ప్రీమియర్ షోస్ ఏంట్రా..? "బాహుబలి: ది ఎపిక్" పెద్ద ప్లానే ..!

ఓవర్సీస్, తమిళనాడులో డ్యూడ్ హవా!

తెలుగు రాష్ట్రాల పక్కనపెట్టి చూస్తే మాత్రం ప్రదీప్ రంగనాథన్ దూకుడు చూపిస్తున్నారు. అమెరికా, గల్ఫ్ తదితర ఓవర్సీస్ మార్కెట్లలో 'డ్యూడ్' సినిమాకు రూ.12 కోట్లు బిజినెస్ జరగగా, ‘తెలుసు కదా’కి కేవలం రూ.4 కోట్లు మాత్రమే వచ్చింది. అదే విధంగా తమిళనాడు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో ‘డ్యూడ్’ డామినేట్ చేస్తోంది.

Also Read: ప్రభాస్ బర్త్‌డే స్పెషల్ అప్‌డేట్స్ ఇవే.. ఫ్యాన్స్‌కు పండగే..!

తమిళనాడు మార్కెట్‌లో 'డ్యూడ్' థియేట్రికల్ రైట్స్ రూ.31 కోట్లు, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి మరో రూ.6 కోట్లు బిజినెస్ చేశారు. కానీ ‘తెలుసు కదా’కి ఈ రెండు మార్కెట్లను కలిపి రూ.1.5 కోట్లు మాత్రమే వచ్చింది.

Also Read: రెబల్ స్టార్ ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మా.. 'పౌర్ణమి' 4K రీ రిలీజ్ బుకింగ్స్ ఓపెన్..!

అప్పర్ హ్యాండ్ ఎవరిదంటే?

వరల్డ్‌వైడ్ థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే ‘డ్యూడ్’ రూ.59 కోట్లు, ‘తెలుసు కదా’ రూ.22 కోట్లు. ‘డ్యూడ్’ సినిమాకు బ్రేక్ ఈవెన్ అయ్యి ప్రాఫిట్ జోన్ లోకి వెళ్లాలంటే 100 కోట్ల గ్రాస్ అవసరం, ‘తెలుసు కదా’ అయితే 50 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి.

Advertisment
తాజా కథనాలు