/rtv/media/media_files/2025/10/16/baahubali-the-epic-2025-10-16-16-08-00.jpg)
Baahubali The Epic
Baahubali The Epic: దేశవ్యాప్తంగా సినిమా ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాహుబలి సిరీస్ మళ్లీ తెరపైకి రాబోతుంది. రెండు భాగాలను కలిపి, కొత్తగా కట్ చేసి, మరింత అద్భుతంగా “బాహుబలి: ది ఎపిక్” పేరుతో అక్టోబర్ 31, 2025న థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.
Also Read: రీ-రిలీజ్ కి ప్రీమియర్ షోస్ ఏంట్రా..? "బాహుబలి: ది ఎపిక్" పెద్ద ప్లానే ..!
3 గంటల 45 నిమిషాల రన్‌టైమ్
ఈ స్పెషల్ ఎడిషన్‌కు U/A 16+ సర్టిఫికేట్ లభించగా, 3 గంటల 45 నిమిషాల రన్‌టైమ్‌తో ప్రేక్షకులను అద్భుతమైన విజువల్స్, ఎమోషనల్ డ్రమా, గ్రాండ్ యాక్షన్ సీన్స్‌తో మాయలోకి తీసుకెళ్లనుంది.
Baahubali The Epic Certified UA16+ by CBFC with a runtime 3 hours 45 minutes. 💥 #Prabhas#AnushkaShetty#BaahubaliTheEpic#Baahubalipic.twitter.com/BKgt3f4o1R
— Being Shivam (@beingshivam_90) October 16, 2025
Also Read: రెబల్ స్టార్ ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మా.. 'పౌర్ణమి' 4K రీ రిలీజ్ బుకింగ్స్ ఓపెన్..!
మాహిష్మతి సామ్రాజ్యం, బాహుబలి(Prabhas), భల్లాలదేవ, దేవసేన, కట్టప్ప వంటి పవర్ ఫుల్ పాత్రలు మళ్లీ తెరపై కనిపించబోతుండటంతో, ఆనందంలో తేలిపోతున్నారు అభిమానులు. రాజమౌళి(Rajamouli) సృష్టించిన ఈ ప్రపంచాన్ని మరోసారి పెద్ద తెరపై చూడాలనే ఆసక్తి అందరికి విపరీతంగా పెరిగిపోతుంది.
ఈ సినిమాను ప్రేక్షకులకు మరింత అద్భుతమైన అనుభూతి కలిగించేలా IMAX, 4DX, Dolby Cinema, DBox, EpiQ, ICE, PCX లాంటి అత్యాధునిక ఫార్మాట్లలో విడుదల చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఇన్ని మల్టీప్లెక్స్ ఫార్మాట్లలో ఒకేసారి రిలీజ్ కావడం చాలా అరుదు.
Also Read: 'నా డార్లింగ్ సో స్వీట్'.. ప్రభాస్ ని పొగిడేస్తున్న ముద్దుగుమ్మ..!
నిర్మాత శోభు యార్లగడ్డ మాట్లాడుతూ, అన్నపూర్ణ స్టూడియోస్‌తో కలిసి ఈ సినిమాను అన్ని ఫార్మాట్లకు టైం మీదగా రెడీ చేయడం కోసం కష్టపడుతున్నామని తెలిపారు.
ఇప్పటికే ఉన్న హైప్, గతంలో ఈ సినిమా సృష్టించిన సంచలనం చూస్తే, ఈసారి బాహుబలి రీ-కట్ వెర్షన్ కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. భారీ స్థాయిలో విజువల్స్, భావోద్వేగాలతో నిండిన కథ, టెక్నికల్ ప్రెజెంటేషన్ ఈ సినిమాను మరో మెట్టు ఎక్కించబోతున్నాయి. అక్టోబర్ 31 రిలీజ్ డేట్‌గా ఫిక్స్ కాగా, అక్టోబర్ 29న ప్రీమియర్ షోలు జరగనున్నాయి.