Prabhas Birthday: ప్రభాస్ బర్త్‌డే స్పెషల్ అప్‌డేట్స్ ఇవే.. ఫ్యాన్స్‌కు పండగే..!

అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు మూడు స్పెషల్ గిఫ్ట్స్ సిద్ధంగా ఉన్నాయి. ‘ది రాజా సాబ్’ ఫస్ట్ సాంగ్, హను రాఘవపూడి సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్, ‘బాహుబలి: ది ఎపిక్’ ట్రైలర్ రిలీజ్. దీంతో ఈ బర్త్‌డే ప్రభాస్ ఫ్యాన్స్‌కు స్పెషల్ కానుంది.

New Update
Prabhas Birthday

Prabhas Birthday

Prabhas Birthday: పాన్ ఇండియా హీరో రెబెల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23 దగ్గర పడుతోంది. ప్రతీ ఏడాది ఈ రోజున ఆయన అభిమానులు కొత్త అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. గతంలో మాత్రం ప్రభాస్ బర్త్‌డే రోజున పెద్దగా అప్డేట్స్ ఏమి ఇచ్చేవారు కాదు, కానీ ఈసారి మాత్రం విషయం వేరుగా ఉండబోతోంది.

మొదటి సర్ప్రైజ్ - ది రాజా సాబ్ ఫస్ట్ సాంగ్.. 

ప్రభాస్ నటిస్తున్న "ది రాజా సాబ్" షూటింగ్ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం గ్రీస్‌లో ఒక భారీ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాట ప్రభాస్ ఇంట్రడక్షన్ సాంగ్‌గా ఉండబోతోంది. సంక్రాంతికి జనవరి 9న రిలీజ్ అయ్యే ఈ సినిమాకి, బర్త్‌డే స్పెషల్‌గా ఆ ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. పాటను ఎంతో గ్రాండ్‌గా తెరకెక్కించారు.

రెండవ ట్రీట్ - ఫౌజీ టైటిల్ రివీల్..

ప్రభాస్ మరో సినిమా హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న "ఫౌజీ" (వర్కింగ్ టైటిల్‌) ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. హను ఇటీవల జరిగిన ఒక ఈవెంట్‌లో బర్త్‌డే రోజు టైటిల్ రివీల్ ఉంటుందని కన్ఫర్మ్ చేశారు. అద్భుతమైన ఎమోషనల్ టచ్‌తో కూడిన ఈ సినిమా టైటిల్‌పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.

మూడవ గిఫ్ట్ - బాహుబలి: ది ఎపిక్ ట్రైలర్..

బాహుబలి రెండు భాగాలను కలిపి కొత్తగా కట్ చేసిన వర్షన్ "బాహుబలి: ది ఎపిక్" పేరుతో అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇది IMAX, Dolby Cinema, 4DX, DBox వంటి భారీ ఫార్మాట్లలో విడుదలవుతుండగా, దానికి సంబంధించిన ట్రైలర్‌ను ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా రిలీజ్ చేయనున్నారు.

ఈసారి ప్రభాస్ బర్త్‌డేను అభిమానులు మర్చిపోలేరు. ఒకేసారి మూడు పెద్ద అప్డేట్స్, సాంగ్, టైటిల్, ట్రైలర్‌తో సరికొత్తగా సెలబ్రేట్ చేయనున్నారు. అయితే ప్రభాస్ పెళ్లి గురించి ఏమైనా అప్డేట్స్ వస్తాయా? అన్నదే ఇంకా క్లారిటీ లేదు. కానీ సినిమాల పరంగా మాత్రం ప్రభాస్ అభిమానులకు ఇది పండగే!

Advertisment
తాజా కథనాలు