Pournami 4K Re-Release: రెబల్ స్టార్ ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మా.. 'పౌర్ణమి' 4K రీ రిలీజ్ బుకింగ్స్ ఓపెన్..!

రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన క్లాసిక్ మూవీ ‘పౌర్ణమి’ అక్టోబర్ 23న 4Kలో మళ్లీ థియేటర్లలో విడుదలవుతోంది. శివకేశవుడిగా ప్రభాస్ నటన, దేవిశ్రీ సంగీతం, ప్రబుదేవా దర్సకత్వం మళ్లీ వెండితెరపై మాయ చేయనున్నాయి. ఫ్యాన్స్‌కు ఇది స్పెషల్ మూమెంట్.

New Update
Pournami 4K Re-Release

Pournami 4K Re-Release

Pournami 4K Re-Release: రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు ఈ దీపావళి సీజన్ ఓ ప్రత్యేక ఉత్సవంగా మారనుంది. ఎందుకంటే ఆయన గతంలో నటించిన క్లాసిక్ సినిమా ‘పౌర్ణమి’ ఇప్పుడు 4K ఫార్మాట్‌లో రీ-రిలీజ్ కాబోతుంది. ఇది ప్రభాస్ జన్మదినాన్ని(Prabhas Birthday) పురస్కరించుకుని అక్టోబర్ 23, 2025 న విడుదల కానుంది.

Also Read: 'రాజా సాబ్' లేట్ కి బన్నీ సినిమానే కారణం? అసలేం జరిగిందంటే..

మళ్లీ తెరపై శివకేశవుడు..

2006లో విడుదలైన పౌర్ణమి సినిమాకు అప్పట్లోనే విశేష ఆదరణ లభించింది. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్, త్రిషా, చార్మి కీలక పాత్రల్లో నటించారు. భక్తి, ప్రేమ, త్యాగం, సంప్రదాయం అనే అంశాలను చక్కగా చూపిస్తూ, ఈ సినిమా ఆధ్యాత్మికతతో పాటు భావోద్వేగాలకూ పెద్దపీట వేసింది.

Also Read: ఒకేసారి ఇద్దరు హీరోయిన్స్‌తో సిద్ధు.. ‘తెలుసు కదా’ ట్రైలర్ షాక్ ఇచ్చిందా..?

ఇప్పుడు 4K రూపంలో మళ్లీ విడుదలవుతున్న ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడడం ద్వారా, అద్భుతమైన విజువల్స్‌కి తోడు దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతాన్ని మరోసారి ఆస్వాదించే అవకాశం రానుంది. డిజిటల్‌గా రీమాస్టర్ చేసిన ఈ వెర్షన్‌ ద్వారా ప్రతి ఫ్రేమ్ స్పష్టంగా, కొత్తగా కనిపించనుంది.

ఫ్యాన్స్ కోసం స్పెషల్ షోలు.. హష్‌ట్యాగ్ పౌర్ణమి 4K ట్రెండ్

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రభాస్ ఫ్యాన్స్ పౌర్ణమి రీ-రిలీజ్‌ను పెద్దగా సెలబ్రేట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. స్పెషల్ ఫ్యాన్ షోలు, మిడ్‌నైట్ స్క్రీనింగ్స్ తో థియేటర్లు ముస్తాబవుతున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో #Pournami4K హష్‌ట్యాగ్‌తో పౌర్ణమి సినిమాకు మళ్లీ క్రేజ్ పెరుగుతోంది.

Pournami 4k Bookings Open

ఇప్పటికే  'పౌర్ణమి' 4K రీ రిలీజ్ కు సంబందించిన బుకింగ్స్ ఈరోజు (అక్టోబర్ 15న) ఉదయం 11 గంటల 07 నిమిషాలకు ఓపెన్ చేయనున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేసారు. అలాగే అందుకు సంబందించిన రిలీజ్ ట్రైలర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేసారు.

Also Read: ఎవరి వల్ల కానిది 'బాహుబలి: ది ఎపిక్' రీరిలీజ్ తో జరుగుతోంది.. ఏంటో తెలిస్తే..!

ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లో ఓ ప్రత్యేక స్థానం కలిగిన చిత్రం. ఆయనలోని డాన్స్ టాలెంట్, ఎమోషన్స్, డెడికేషన్ అన్నీ ఈ సినిమాలో కనిపించాయి. బాహుబలి, సలార్ వంటి పెద్ద సినిమాల తర్వాత, పౌర్ణమి లాంటి కంటెంట్ బేస్డ్ సినిమాల రీ-రిలీజ్ ఆయన అభిమానుల్ని ఓ కొత్త ట్రిప్‌కి తీసుకెళ్తోంది.

ఈ రీ-రిలీజ్ కేవలం సినిమా చూడటానికి మాత్రమే కాదు, ప్రభాస్ కెరీర్ జర్నీని గుర్తుచేసే ఒక స్పెషల్ మూమెంట్ కూడా. శివకేశవుడి పాత్రలో ఆయన చూపించిన ఆధ్యాత్మికత, త్యాగం ప్రెజెంట్ జనరేషన్ కు కూడా కనెక్ట్ అవుతోంది..

Also Read: ప్రతీ సీన్‌ క్లైమాక్స్ లా..! "డూడ్"పై మమితా బైజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఈ అక్టోబర్ 23న పౌర్ణమి 4Kలో తిరిగి మళ్లీ మన ముందుకు రానుంది. ఒకవేళ మీరు అప్పట్లో థియేటర్లో చూసినా, లేదా ఇప్పుడు ఫస్ట్‌టైమ్ చూస్తున్నవారైనా ఈ సినిమా ఎప్పటికి ఆల్ టైమ్ క్లాసిక్ గా ఉండిపోతుంది. ఈ అక్టోబర్ 23న సిల్వర్ స్క్రీన్‌పై మళ్లీ ప్రభాస్‌ను శివకేశవుడిగా చూసే అవకాశం మిస్ కాకండి!

Advertisment
తాజా కథనాలు