The Paradise: ‘ది ప్యారడైజ్’.. నాని హెయిర్‌స్టైల్ వెనుక ఇంత పెద్ద ఎమోషన్ ఉందా?.. దర్శకుడి భావోద్వేగ వ్యాఖ్యలు!

ది ప్యారడైజ్‌ మూవీలో నాని రెండు జడల గెటప్‌పై దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మాట్లాడాడు. ఆ రెండు జడల వెనుక తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన భావోద్వేగం ఉందని అన్నాడు. చిన్నతనంలో 5వ తరగతి వరకు తన తల్లి అలానే తనకు జడలు వేసి స్కూల్‌కి పంపించేదని చెప్పుకొచ్చాడు.

New Update
Director Srikanth Odela said Nani hairstyle in The Paradise movie has an emotion

Director Srikanth Odela said Nani hairstyle in The Paradise movie has an emotion

నేచురల్ స్టార్ నాని వైవిధ్యమైన కథలతో వరుస సినిమాలు చేస్తున్నాడు. కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తూ బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుంటున్నాడు. గతేడాది రెండు మూడు సినిమాలు తీసి మంచి హిట్లు అందుకున్నాడు. అదే సమయంలో కలెక్షన్లతో కూడా బాక్సాఫీసును షేక్ చేశాడు. ఇక ఈ ఏడాది మరో వైవిధ్యమైన స్టోరీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యాడు. తనకు గతంలో ‘దసరా’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందించిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో మరో సినిమా చేస్తున్నాడు. 

ఇది కూడా చూడండి: SSMB29 కోసం రాష్ట్రం దాటిన మహేశ్.. ఉత్కంఠభరితమైన సన్నివేశాలపై షూట్!

నాని కొత్త గెటప్

వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘ది ప్యారడైజ్’. ఇటీవలే ఈ సినిమా నుంచి అదిరిపోయే ఫస్ట్‌లుక్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. అందులో నాని ఊరమాస్ లుక్ చూసి అంతా ఆశ్చర్యపోయారు. నాని గెటప్ సరికొత్తగా అనిపించిందని.. ఇప్పటి వరకు అలాంటి పాత్రలో నాని ఎప్పుడూ చూడలేదని అభిమానులు సైతం ఉత్సాహపడుతున్నారు. 

ఇది కూడా చూడండి: హమ్మయ్య.. రెండేళ్ల తర్వాత OTTలోకి అయ్యగారి సినిమా.. అక్కినేని ఫ్యాన్స్ సంబరాలు!

మాస్ అండ్ రగ్గడ్‌లుక్‌లో రెండు జడలు వేసుకొని ఉన్న గెటప్‌కు రెస్పాన్స్ ఓ రేంజ్‌లో వచ్చింది. ఇప్పుడదే గెటప్‌పై నెట్టింట పెద్ద చర్చే నడుస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.. నాని హెయిర్‌ స్టైల్‌పై మాట్లాడాడు. నాని లుక్ వెనుక ఒక పెద్ద ఎమోషన్ దాగి ఉందని శ్రీకాంత్ ఓదెల చెప్పాడు. 

5వ తరగతి వరకు

అయితే దాని గురించి ఇప్పుడు వెల్లడించకూడదని అన్నాడు. కానీ ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నట్లు తెలిపాడు. నాని రెండు జడల వెనుక తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన భావోద్వేగం ఉందని అన్నాడు. చిన్నతనంలో తన తల్లి అలానే తనకు జడలు వేసేదని.. 5వ తరగతి వరకు జుట్టు అల్లి స్కూల్‌కు పంపించేదని చెప్పుకొచ్చాడు. అయితే ఆ లుక్ సినిమా కథకు ఎలా కనెక్ట్ అవుతుందో మాత్రం ఇప్పుడే చెప్పనని తెలిపాడు. ప్రస్తుతం అతడి వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

ఇది కూడా చూడండి: రైల్వేలో మరో 835 పోస్టులు.. త్వరగా దరఖాస్తు చేసుకోండి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు