Nagarjuna: అఖిల్‌ పెళ్లి గురించి నాగార్జున కీలక వ్యాఖ్యలు!

అక్కినేని ఇంట వరుస వివాహ వేడుకలు జరుగనున్న విషయం తెలిసిందే. నాగార్జున పెద్దకుమారుడు నాగ చైతన్య వివాహం మరో వారంలో ఉండగా...చిన్న కుమారుడు అఖిల్‌ వివాహం వచ్చే ఏడాది జరగనుందని నాగార్జున తెలిపారు.

New Update
akhil 4

Nagarjuna: అక్కినేని ఇంట వరుస వివాహ వేడుకలు జరుగనున్న విషయం తెలిసిందే. నాగార్జున పెద్దకుమారుడు నాగ చైతన్య వివాహం మరో వారంలో ఉండగా...చిన్న కుమారుడు అఖిల్‌ కూడా పెళ్లికి రెడీ అయ్యాడు.తన కుటుంబంలో వరుస శుభకార్యాలు జరగడం పై నాగార్జున ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. 

Also Read: Crime: యువతిని 40 ముక్కలుగా నరికి చంపిన ప్రియుడు.. కారణం ఏంటో తెలుసా?

ఈ ఏడాది మా కుటుంబానికి ఎంతో ప్రత్యేకం. ఓ వైపు నాన్నగారి శత జయంతి వేడుకలు జరుగుతున్నాయి. మరో వైపు నా కుమారులిద్దరూ జీవితంలో కొత్త అధ్యయాన్ని ప్రారంభించనున్నారు. డిసెంబర్‌ 4న చైతూ శోభిత పెళ్లి జరగనుంది.పెళ్లి పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. నా తండ్రి స్థాపించిన అన్నపూర్ణ స్టూడియోస్‌ లో ఈ పెళ్లి జరగడం ఆనందంగా ఉందని వివరించారు. మా కుటుంబం ఎంతో పెద్దది. అదే విధంగా శోభిత వాళ్ల కుటుంబం కూడా పెద్దదే. కుటుంబ సభ్యులు, తక్కువ మంది అతిథుల సమక్షంలో గ్రాండ్‌ గా చేయాలనుకుంటున్నాం. మా రెండో అబ్బాయి అఖిల్ కూడా వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నందుకు ఆనందంగా ఉంది.

Also Read: ప్రయాణికులకు ఏపీఎస్‌ఆర్టీసీ బంపరాఫర్.. టికెట్ ధరలపై 20 శాతం రాయితీ!

జైనబ్‌ ఎంతో మంచి అమ్మాయి. ఇతరులపై ఎంతో ప్రేమ, అభిమనం కలిగి ఉంటుంది. వారిద్దరూ కలిసి జీవితాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నందుకు సంతోషంగా ఉంది. అఖిల్‌ జీవితాన్ని ఆమె పరిపూర్ణం చేయగలదు. ఆమెను సంతోషంగా మా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాం. వచ్చే ఏడాదిలో వీరి పెళ్లి జరగనుంది. అని నాగార్జున చెప్పారు.

Also Read: జార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా హేమంత్‌ ప్రమాణ స్వీకారం..రానున్న ఖర్గే,రాహుల్‌

అఖిల్‌ జైనబ్‌ నిశ్చితార్థం జరిగినట్లు మంగళవారం నాగార్జున ప్రకటించారు. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో నాగార్జున ఇంట్లో ఈ వేడుక జరిగింది. జైనబ్‌ తో మా అఖిల్ నిశ్చితార్థం జరిగిందని తెలియజేస్తున్నందకు ఆనందిస్తున్నాం. కోడలిగా జైనబ్‌ను మా కుటుంబంలోకి ఆహ్వానిస్తుందుకు చాలా సంతోషంగా ఉంది.

Also Read:  Crime: నడి రోడ్డుపై కత్తులతో నరికి..ఏపీలో హిజ్రాల నాయకురాలి దారుణ హత్య

జైనబ్‌ చిత్రకారిణి, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ గా మంచి పేరుంది. మన దేశంలోనే కాక దుబాయ్‌, లండన్‌ లోనూ ప్రదర్శనలిచినట్లు తెలిసింది. ఆమె హైదరాబాద్‌ లో పుట్టి ముంబయిలో స్థిరపడ్డట్లు సమాచారం. జైనబ్‌ తండ్రి జుల్ఫీ , నాగార్జునకు మధ్య కొన్నేళ్లుగా స్నేహం ఉంది. 

జైనబ్‌కు రెండేళ్ల క్రితం అఖిల్‌ తో పరిచయం ఏర్పడిందని..ఆ తర్వాత అదికాస్త ప్రేమగా మారిందని తెలుస్తుంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు