Crime: యువతిని 40 ముక్కలుగా నరికి చంపిన ప్రియుడు.. కారణం ఏంటో తెలుసా? జార్ఖండ్‌లో శ్రధ్దా వాకర్ తరహా హత్య ఒకటి వెలుగులోకి వచ్చింది. సహాజజీవనం చేస్తున్న యువతిని నరేష్ అనే వ్యక్తి అత్యంత దారుణంగా హత్య చేశాడు. అంతేకాకుండా ఆమె శరీరాన్ని 40 ముక్కలుగా కోసి అటవీ ప్రాంతంలో పడేశాడు. By Bhavana 28 Nov 2024 in నేషనల్ క్రైం New Update షేర్ చేయండి Jarkhand: జార్ఖండ్‌లో ఓ దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు తన సహాజీవనం చేస్తున్న యువతిని దారుణంగా హత్య చేశాడు. అనంతరం శరీరాన్ని 40 నుంచి 50 ముక్కలుగా నరికాడు. ఖుంటి జిల్లాలోని జరియాగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ అత్యంత దారుణ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని జోర్దాగ్ గ్రామానికి చెందిన నరేష్ బెంగ్రా అనే యువకుడు గంగి కుమారి (24) అనే యువతితో రెండేళ్లుగా సహాజీవనం చేస్తున్నాడు. Also Read: ప్రయాణికులకు ఏపీఎస్‌ఆర్టీసీ బంపరాఫర్.. టికెట్ ధరలపై 20 శాతం రాయితీ! అయితే బెంగ్రా గంగికి తెలియకుండా మరో మహిళను వివాహం చేసుకున్నాడు. దీంతో ఈ విషయం గురించి ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే ఈ నెల 24న యువతిని తన ఇంటికి సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి, అత్యాచారం చేసి గొంతు నులిమి చంపేశాడు. ఆ తరువాత యువతి శరీరాన్ని 50 ముక్కలుగా నరికి అడవిలోనే పారేశాడు. Also Read: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ ప్రమాణ స్వీకారం..రానున్న ఖర్గే,రాహుల్ బాలిక శరీరంలోని భాగాన్నిఓ వీధీ కుక్క తినడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిని గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించగా.. మరికొన్ని శరీర భాగాలతో పాటు, యువతి బ్యాగ్ ని ఒకదానిని కూడా వారు స్థానికంగా కనుగొన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు నరేశ్ బెంగ్రాను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. Also Read: Crime: నడి రోడ్డుపై కత్తులతో నరికి..ఏపీలో హిజ్రాల నాయకురాలి దారుణ హత్య ఈ కేసును విచారించిన ఇన్‌స్పెక్టర్ అశోక్ సింగ్ మాట్లాడుతూ, ఆ వ్యక్తి తమిళనాడులోని ఒక మాంసం దుకాణంలో పని చేసినట్లు కనుగొన్నామని తెలిపారు.నిందితుడు పథకం ప్రకారమే, ఆమెను తన ఇంటి సమీపంలోని ఆటోరిక్షాలో అటవీ ప్రాంతంలోనికి తీసుకెళ్లి, అక్కడ కొంచెం సేపు ఆమెను వేచి ఉండమన్నాడు. ఆ తరువాత అతను పదునైన ఆయుధాలతో తిరిగి వచ్చి, అత్యాచారం చేసిన తర్వాత ఆమె దుపట్టాతో గొంతు కోసి, ఆపై మృతదేహాన్ని 40 నుండి 50 ముక్కలుగా నరికి వెళ్లిపోయాడు. Also Read: Pawan Kalyan: రాజ్యసభకు నాగబాబు.. పవన్ సంచలన నిర్ణయం! ఈ సంఘటన 2022 నాటి శ్రద్ధా వాకర్ హత్య కేసు ను తలపిస్తుండడంతో ఆ ప్రాంత ప్రజలకు భయాందోళనలకు గురవుతున్నారు. #50-pieces #murder #jharkand #boy-friend మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి