Arun Roy: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ డైరెక్టర్ మృతి

బెంగాలీ దర్శకుడు అరుణ్ రాయ్ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతూ మృతి చెందారు. డిసెంబర్‌లో ఆసుపత్రిలో చేరిన అతని ఆరోగ్యం క్షీణించడంతో తుది శ్వాస విడిచారు. 2011లో ఎగారో సినిమాతో బెంగాలీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు.

New Update
Arun Roy

Arun Roy Photograph: (Arun Roy)

కొత్త ఏడాదిలో బెంగాలీ దర్శకుడు అరుణ్ రాయ్ 56 ఏళ్ల వయస్సులో తుది శ్వాస విడిచారు. ఏడాది నుంచి అరుణ్ రాయ్ క్యాన్సర్ సమస్యతో బాధపడుతున్నారు. కానీ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో కొన్ని రోజుల క్రితం కోల్‌కతాలోని ఆర్‌జీకర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేరారు. క్యాన్సర్, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌కి తోడు రోగనిరోధక శక్తి పూర్తిగా క్షీణించింది. చికిత్స తీసుకుంటూనే ఆసుపత్రిలో ఈ రోజు ఉదయం 7 గంటలకు మరణించారు. 

ఇది కూడా చూడండి: AP JOBS: ఏపీ దేవాదాయ శాఖలో ఉద్యోగాలు.. అర్హత, చివరి తేదీ వివరాలివే!

ఇది కూడా చూడండి:Air India: ప్రయాణికులకు అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చిన ఎయిర్‌ ఇండియా..

విమర్శకుల నుంచి ప్రశంసలు..

అరుణ్ రాయ్ అసలు పేరు అరుణవ రాయచౌధురి. 2011లో ఎగారో సినిమాతో బెంగాలీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈ సినిమా విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత హీరాలాల్, చోలై వంటి పలు సినిమాలు చేశారు. చివరిగా బాఘా జతిన్ సినిమాకి దర్శకత్వం వహించారు. 

ఇది కూడా చూడండి:TS: గర్ల్స్ హాస్టల్ బాత్‌రూమ్‌లో వీడియోలు.. విద్యార్థినుల ఆందోళన

Advertisment
తాజా కథనాలు