Kubera Movie: థియేటర్‌లో ధనుష్, శేఖర్ కమ్ముల రచ్చ రచ్చ - వీడియో వైరల్

ధనుష్ అండ్ శేఖర్ కమ్ముల టీం తమ ‘కుబేర’ సినిమాను చూశారు. చెన్నై కోయంబేడులోని రోహిణి థియేటర్‌లో అభిమానులతో కలిసి ఫస్ట్ షో వీక్షించారు. ఆ టైంలో అభిమానులు థియేటర్‌లో రచ్చ రచ్చ చేశారు. ధనుష్, శేఖర్ కమ్ముల ఇద్దరూ ఫ్యాన్స్ అభిమానానికి ఫిదా అయిపోయారు.

New Update
Dhanush and sekhar kammula watching her kubera movie with fans in theatre

Dhanush and sekhar kammula watching her kubera movie with fans in theatre

Kubera Movie: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున కలిసి నటించిన చిత్రం ‘కుబేర’. క్లాసిక్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఇవాళ గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో భారీ అంచనాల మధ్య విడుదలైంది. విదేశాల్లో సైతం ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేశారు. 

Also Read: ఇండిగో విమానంలో చిక్కుకున్న మరో మాజీ CM

కుబేర మూవీ టీం సందడి

ఇదిలా ఉంటే తమిళనాడులో ఇవాళ ఉదయం 9 గంటలకు కుబేర సినిమా ఫస్ట్ షో ప్రదర్శించారు. ఈ షోలో ప్రేక్షకులు, అభిమానులతో పాటు కుబేర మూవీ యూనిట్ సైతం సందడి చేసింది. చెన్నైలోని కోయంబేడులోని రోహిణి థియేటర్‌లో నటుడు ధనుష్, ఆయన కుమారుడు లింగా, దర్శకుడు శేఖర్ కమ్ముల అండ్ మూవీ టీం అభిమానులతో కలిసి కుబేర సినిమా చూసింది. 

Also Read: ఇరాన్‌లో 1,100 లక్ష్యాలను ధ్వంసం చేశాం.. ఇజ్రాయెల్‌ కీలక ప్రకటన

Also Read: 1978 కి ముందు ఇరాన్ ఎలా ఉండేదో తెలుసా ?.. వీడియోలు వైరల్

ఫ్యాన్స్ సందడికి థియేటర్లలో రచ్చరచ్చ అయింది. శేఖర్ కమ్ముల, ధనుష్ తమ అభిమానుల సందడి మధ్య భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. కాగా ఈ మూవీలో నటుడు ధనుష్ యాక్టింగ్‌కు సిని ప్రియులు, అభిమానులు ఫిదా అయిపోయారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు