Pushpa2 స్టేజీపైనే నిర్మాతపై షాకింగ్ కామెంట్స్ చేసిన దేవిశ్రీ ప్రసాద్‌

పుష్ప 2 చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహించినప్పటికీ, నేపథ్య సంగీతం కోసం ఇతర సంగీత దర్శకులను తీసుకురావడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో దేవి శ్రీ తన ఆవేదన, ఆగ్రహాన్ని వేదిక పైనే వెల్లడించారు.

bunny
New Update

Pushpa2: పుష్ప ది రూల్' సంగీతం విషయంలో గొడవలు జరిగాయనే విషయం మరోసారి బయట పడింది. అల్లు అర్జున్, చిత్ర దర్శకుడు  సుకుమార్, ‌ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మధ్య మంచి స్నేహం ఉంది. వాళ్ల కాంబో లో వచ్చిన ప్రతి సినిమా కూడా మ్యూజికల్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.

Also Read: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి..ఈ జాగ్రత్తలు తప్పనిసరి మరి

కనీ ఈ  టైమ్ లో దేవి శ్రీని తప్పించి మరొక సంగీత దర్శకుడిని నేపథ్య సంగీతం అందించడం కోసం ఎందుకు తీసుకువచ్చారని ప్రశ్న చాలా మందితో పాటు,దేవి శ్రీ అభిమానుల్లో కూడా  తలెత్తింది. నిర్మాత ఒత్తిడి వల్లే 'పుష్ప 2 ది రూల్' చిత్రానికి తమన్ నేపథ్య సంగీతం అందించడానికి వచ్చినట్లు టాక్‌ నడుస్తుంది. 

ఈ నేపథ్యంలో  చెన్నైలో జరిగిన కార్యక్రమంలో స్టేజి మీద దేవి శ్రీ ప్రసాద్ ఆయన మనసులో బయట పెట్టేశారు. అసలు ఇంతకీ స్టేజీ మీద  దేవి ఏం అన్నారు? అనే వివరాల్లోకి వెళితే...అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా సినిమా ‘పుష్ప 2’. రష్మిక హీరోయిన్‌. సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

Also Read: Sabarimala: శబరిమలకు పోటెత్తిన స్వాములు.. పంబ వరకూ క్యూలైన్!

ఈ నేపథ్యంలో చిత్ర టీమ్ లియో ముత్తు ఇండోర్‌ స్టేడియంలో వేడుక నిర్వహించింది. అల్లు అర్జున్‌, రష్మిక, శ్రీలీల , సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ తన అసహనాన్ని దేవి నవ్వుతూనే బయిటపెట్టేసారు. ఎవరు ఏమనుకున్నా సరే..తగ్గేదేలే అన్న రీతిలో స్టేజిపై నిర్మాతలకు తనదైన శైలిలో కౌంటర్ వేసారు.

పుష్ప 2 బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం దేవిని ప‌క్క‌న పెట్టి త‌మ‌న్‌, అజ‌నీష్ లోక్ నాథ్ శ్యామ్ లను మైత్రీ బ్యానర్స్‌ వారు రంగంలోకి  దింపారు. దేవిశ్రీ ప్ర‌సాద్ స‌మ‌యానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వ‌లేద‌ని, అందువ‌ల్ల మ‌రో ముగ్గుర్ని తీసుకోవాల్సివ‌చ్చింద‌ని మూవీ టీమ్ క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది.

Also Read: ఝార్ఖండ్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న హేమంత్ సోరెన్.. ఎప్పుడంటే ?

అయితే తాను సింగిల్ గా చేయాల్సిన ప‌ని మ‌రొక‌రికి అప్ప‌గించ‌డం దేవికి న‌చ్చ‌లేదు,నచ్చదు అనేది టాక్‌. సుకుమార్ కూడా నిర్మాత‌ మాటల్ని కాద‌న‌లేక‌ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాధ్య‌త‌ల్ని మూడు భాగాలుగా షేర్ చేసి, మ‌రో ముగ్గురికి ఇచ్చినట్లు సమాచారం. అయితే దేవిశ్రీ త‌న వంతుగా సినిమాకు ఆర్‌.ఆర్ ఇచ్చుకొంటూ వెళ్లాడ‌ని, దేవిశ్రీ ఇచ్చిన వెర్ష‌నే ఫైన‌ల్ కాపీలో వినే అవ‌కాశం ఉంద‌ని ఇన్ సైడ్ వ‌ర్గాలు అంటున్నాయి. అయితే… దేవిశ్రీ‌కి మైత్రీ మూవీస్ పై ఉన్న అస‌హ‌నం మాత్రం తగ్గినట్లు కనిపించలేదు.

ఏం కావాలన్నా అది అడిగి తీసుకోవాలి..

అది చెన్నైలో జ‌రిగిన‌ ఈవెంట్ లో కనిపించింది.''మనకు ఏం కావాలన్నా అది అడిగి తీసుకోవాలి. నిర్మాత దగ్గర పేమెంట్ అయినా సరే స్క్రీన్ మీద పేరు అయినా సరే''  అంటూ స్పీచ్ ఇరగదీశాడు.దేవిశ్రీ మాట్లాడుతూ.. ‘‘పుష్ప’ మా అందరికీ ప్రత్యేకం. మనకు ఏది కావాలన్నా అడిగి తీసుకోవాలి. నిర్మాతలు ఇచ్చే పారితోషికమైనా.. తెరపై మన పేరైనా సరే.. అడగకపోతే ఎవరూ ఇవ్వరు. కరెక్టే కదా బన్నీ? అంటూ దేవి శ్రీ తన దైన స్టైల్ లో నిర్మాతలకు చురకులు అంటించాడు. ఫైనల్‌ మిక్సింగ్‌ పనుల్లో సుకుమార్‌ బిజీగా ఉండడంతో ఈ కార్యక్రమానికి రాలేకపోయారు.

Also Read: Crime: వివాహిత అపహరణ..బంధీగా ఉంచి 14 రోజులుగా అత్యాచారం!

ఈ సినిమా కథ, బన్నీ నటన మరో స్థాయిలో ఉంటాయి. నేను ఫస్టాఫ్‌కే ఫిదా అయిపోయా. ఈ చిత్రం కోసం సుకుమార్‌, బన్నీ ఎంతో కష్టపడ్డారు. త్వరలోనే మరో పాట విడుదల కానుంది. అందులో బన్నీ ఊర మాస్‌ స్టెప్పులు చూస్తారు. చాలా మంది హీరోయిన్లు డ్యాన్స్‌ చేసిన తొలి స్పెషల్‌ సాంగ్‌కు నేనే మ్యూజిక్‌ డైరెక్టర్‌ ని అయ్యాను.

ఈ క్రెడిట్‌ ఏ సంగీత దర్శకుడికీ లేదు.ప్రొడ్యూసర్ రవిశంకర్‌ సర్‌.. నేను వేదికపై ఎక్కువ సమయం తీసుకుంటున్నానని మళ్లీ అనొద్దు. ఎందుకంటే.. నేను టైమ్‌కి పాట ఇవ్వలేదు, టైమ్‌కి బ్యాక్‌గ్రౌండ్‌ లేదు, టైమ్‌కి ప్రోగ్రామ్‌కి రాలేదు అని అంటూ ఉంటారు . మీకు నాపై చాలా ప్రేమ ఉంది. కానీ, ప్రేమ ఉంటే ఫిర్యాదులు కూడా ఉంటాయి.

నా విషయంలో మీకు కంప్లైట్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రాంగణంలోకి వచ్చేటప్పుడూ రాంగ్‌ టైమింగ్‌ అన్నారు. ఇవన్నీ వ్యక్తిగతంగా అడిగితే పెద్ద కిక్‌ ఉండదు. ఇలా ఓపెన్‌గా మాట్లాడుకుంటేనే బాగుంటుంది. నేనెప్పుడూ ఆన్‌ టైమ్‌ సర్‌’’ అంటూ నవ్వుతూ తనదైన స్టైల్‌ లో పెద్ద  బ్రహ్మాండాల్ని బద్దలు కొట్టేశారు.

దీంతో పుష్ప 2 సంగీతం విషయంలో గొడవలు జరుగుతున్నాయనే విషయం మరోసారి స్పష్టం అయిపోయింది.

#allu-arjun #pushpa-2 #producer #dsp
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe