ఝార్ఖండ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న హేమంత్ సోరెన్.. ఎప్పుడంటే ? ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో విక్టరీ సాధించిన ఇండియా కూటమి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ ఝార్ఖండ్ కొత్త సీఎంగా నవంబర్ 28న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. By B Aravind 24 Nov 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో విక్టరీ సాధించిన ఇండియా కూటమి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ ఝార్ఖండ్ కొత్త సీఎంగా నవంబర్ 28న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆదివారం సమావేశంలో భాగస్వామ్య పక్షాలు కూటమి నేతగా సోరెన్‌ను ఎన్నుకున్నాయి. ఆ తర్వాత ఆయన రాష్ట గవర్నర్ సంతోష్ గంగ్వార్‌తో హేమంత్ సోరెన్ భేటీ అయ్యారు. Also Read: లక్నోకు పంత్, ఢిల్లీకి KL రాహుల్.. ఇప్పటివరకు కొనుగోలైన ఆటగాళ్లు వీరే సీఎంగా రాజీనామా చేసిన ఆయన నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి భాగస్వామ్య పక్షాల మద్దతు లేఖను గవర్నర్‌కు పంపారు. నవంబర్ 28న నాలుగోసారి ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసి ఓడిపోయిన నలుగురిని తిరిగి కేబినెట్‌లో ఛాన్స్ ఇవ్వాలని సోరెన్ నిర్ణయించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో జేఎంఎం - 34, బీజేపీ-21, కాంగ్రెస్-16, ఆర్జేడీ-04, సీపీఐ (ఎంఎల్)(ఎల్)-02. ఏజేఎస్‌యూపీ-01, ఎల్‌జేపీఆర్‌వీ-01, జేకేఎల్‌ఎం- 01, జేడీయూ -01 స్థానం దక్కించుకున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ బీజేపీ కూటమిని జేఎంఎం-కాంగ్రెస్ కూటమి ఓడించి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. Also Read: బీజేపీ సంచలనం.. పార్లమెంట్‌లో 16 బిల్లులు! ఇదిలా ఉండగా భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జనవరి 31న సీఎం హేమంత్ సోరెన్ ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన్ని బిర్సా ముండా జైలుకు తరలించారు. దీంతో ఆయన అరెస్టుకు ముందే సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఫిబ్రవరిలో చంపై సోరెన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. చివరికి ఐదు నెలల తర్వాత హేమంత్ సోరెన్ బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత జులైలో మళ్లీ ఆయనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే, జేఎంఎం-కాంగ్రెస్ కూటమిలు పోటాపోటీగా బరిలోకి దిగాయి. చివరికి ఝార్ఖండ్ ప్రజలు జేఎంఎం-కాంగ్రెస్ కూటమి వైపే మొగ్గుచూపారు. Also Read: షారుఖ్, సల్మాన్ కాదు.. భారతదేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ ఈ తెలుగు హీరోదే..? ఒక్క సినిమాకు 300 కోట్లు Also Read: Jagan: చంద్రబాబుకు జగన్ 6 ప్రశ్నలు.. చెప్పే దమ్ముందా అంటూ..! #telugu-news #national-news #hemanth-soren #jharkhand మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి