Nagarjuna: ఢిల్లీ హైకోర్టులో నాగార్జునకు బిగ్ రిలీఫ్!

టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జునకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది.  ఇటీవలే నాగార్జున  ఆర్టిఫీషియల్ ఇంటలీజెన్స్ ఉపయోగించి తన అనుమతి లేకుండా తన ఫొటోలను, పేరును వాణిజ్య ప్రకటనల కోసం ఉపయోగిస్తున్నారని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

New Update
Nagarjuna

Nagarjuna

టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున(nagarjuna) కు ఢిల్లీ హైకోర్టు(delhi-high-court) లో ఊరట లభించింది.  ఇటీవలే నాగార్జున  ఆర్టిఫీషియల్ ఇంటలీజెన్స్ ఉపయోగించి తన అనుమతి లేకుండా తన ఫొటోలను, పేరును వాణిజ్య ప్రకటనల కోసం ఉపయోగిస్తున్నారని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తాజాగా తీరును వెల్లడించింది. అనుమతి లేకుండా  నాగార్జున పేరు, ఫోటో, వాయిస్, ఆయన వ్యక్తిత్వానికి సంబంధించిన ఏ అంశాన్ని కూడా వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఆయన వ్యక్తిగత గోప్యతకు భంగం కలగకుండా రక్షణ కల్పించింది.  నాగార్జున తన  పిటిషన్‌లో పేర్కొన్న అన్ని వెబ్‌సైట్స్  URL లింకులను 72 గంటల్లోగా తొలగించాలని కోర్టు ఆదేశించింది.

Also Read :  కాబోయే భార్యను పరిచయం చేసిన అల్లు శిరీష్! ఎంగేజ్మెంట్ పిక్స్  వైరల్!

Delhi High Court Bans Use Of Unauthorized Nagarjuna Photos

ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, టెలికమ్యూనికేషన్స్ విభాగాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. నాగార్జున పిటీషన్ పేర్కొన్న  లింకులను బ్లాక్ అయ్యేలా చూడాలని  కోర్టు ఆదేశించింది.

డీప్‌ఫేక్, ఫేస్ మార్ఫింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి టెక్నాలాజీ ఉపయోగించి ఆయన పేరు మర్యాదలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని న్యాయస్థానం హెచ్చరించింది. అనుమతి లేకుండా ఒకరి ఫొటోలను, వీడియోలను దుర్వినియోగం చేయడం వల్ల వారికి ఆర్ధిక నష్టంతో, గౌరవనికి భంగం కలుగుతుందని కోర్ట్ స్పష్టం చేసింది. 

అయితే నాగార్జున ఒక స్టార్ హీరో కావడం వల్ల ఆయనకు చాలా మంది అభిమానులు ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో  ఆయన పేరు, రూపం, వాయిస్ ను దుర్వినియోగం చేయడం వల్ల  ఏది  నిజమైన ప్రకటన, ఏది అబద్దం అని తెలియక ప్రజలు గందరగోళనికి గురయ్యే అవకాశం ఉంటుంది. నాగార్జున మాత్రమే కాదు.. ఈ మధ్య చాలా మంది ప్రముఖుల AI దుర్వినియోగం నుంచి తమ గుర్తింపును కాపాడుకోవడానికి న్యాయ  రక్షణ కోరుతున్నారు. ఇటీవలే ఐశ్వర్య,అభిషేక్ కూడా ఈ విషయంలో కోర్టును ఆశ్రయించారు.

Also Read :  ఎద అందాలతో కుర్రకారును మత్తెక్కిస్తున్న స‌న్యా మ‌ల్హోత్రా.. ఫొటోలు చూశారా?

Advertisment
తాజా కథనాలు