/rtv/media/media_files/2025/10/01/allu-sirish-2025-10-01-16-35-31.jpg)
allu sirish
Allu Sirish: అల్లువారి ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి. అల్లు అర్జున్ (Allu Arjun) తమ్ముడు అల్లు శిరీష్ (allu-sirish) పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఈరోజు అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా తన జీవితంలో ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేశారు. తన కాబోయే భార్యను పరిచయం చేశారు. నయనిక అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని శిరీష్ తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు. ఫేస్ రివీల్ చేయకుండా తన చేయి పట్టుకొని దిగిన ఫొటోను షేర్ చేశారు. దీంతో అల్లు అభిమానులు, సెలబ్రెటీలు శిరీష్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. హీరో అల్లు అర్జున్ కూడా తమ్ముడికి విషెస్ తెలుపుతూ పోస్ట్ పెట్టారు.
అక్టోబర్ 30న ఎంగేజ్మెంట్..
శిరీష్ తన పోస్టులో ఇలా రాసుకొచ్చారు.. మా తాతయ్య రామలింగయ్య జయంతి సందర్భంగా నా జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలని అనుకుంటున్నాను. అక్టోబర్ 30న నయనికా అనే అమ్మాయిని నిశ్చితార్థం చేసుకోబోతున్నాను. మా నాన్నమ్మ ఎప్పుడూ నేను పెళ్లి చేసుకోవాలని కోరుకునేది. ఇప్పుడు ఆమె మా మధ్యలో లేనప్పటికీ ఆమె ఆశీర్వాదాలు మాతోనే ఉంటాయి. అంటూ శిరీష్ పోస్ట్ పెట్టారు.
Also Read : Sanya Malhotra: ఎద అందాలతో కుర్రకారును మత్తెక్కిస్తున్న సన్యా మల్హోత్రా.. ఫొటోలు చూశారా?
అక్టోబర్ 30న ఎంగేజ్మెంట్..
కాబోయే భార్యను పరిచయం చేయడంతో పాటు ఎంగేజ్మెంట్ వివరాలను కూడా పంచుకున్నారు శిరీష్. ఈనెల 31న కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య నిశ్చితార్థం చేసుకోనున్నట్లు తెలిపారు. వధువు నయనిక కుటుంబ నేపథ్యం, ఆమెకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు. సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఆమె హైదరాబాద్ కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కూమార్తె అని తెలుస్తోంది. అంతేకాదు శిరీష్ ఆమెను ప్రేమ వివాహం చేసుకోబోతున్నట్లు కూడా టాక్. మొత్తానికి శిరీష్ తన బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బాయ్ చెప్పబోతున్నారు.
Also Read : Sobhita: పెళ్లి తర్వాత మొదటి సినిమాకు సిద్దమైన అక్కినేని కోడలు! హీరో ఎవరో తెలుసా