Kalki 2: కల్కి 2 నుండి దీపికా అవుట్.. మేకర్స్ క్లారిటీ

దీపికా పదుకునే కాల్కి 2 నుంచి అధికారికంగా తీసేసారు. ప్రాజెక్ట్‌కు అవసరమైన కమిట్‌మెంట్ లేకపోవడంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకునట్లు తెలిపారు. త్వరలోనే ఆమె స్థానంలో మరో స్టార్ హీరోయిన్ ఖరారు చేయనున్నారు.

New Update
Kalki 2

Kalki 2

Kalki 2: ఇండియన్ సినిమా చరిత్రలో భారీ విజయాన్ని సాధించిన చిత్రం ‘కాల్కి 2898 ఏ.డి.’. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డులు బద్దలుకొట్టింది. ప్రభాస్(Prabhas) ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే కీలక పాత్రలో నటించారు. కథంతా ఆమె పాత్ర చుట్టూ తిరుగుతూ సాగుతుంది.

ఇంత పెద్ద హిట్ తర్వాత, ప్రేక్షకులు ఎంతో కాలంగా కాల్కి 2 కోసం ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా వచ్చిన షాకింగ్ అప్డేట్ ఫిల్మ్ వర్గాల్లో కలకలం రేపుతోంది. దీపికా పదుకునే కాల్కి 2లో ఉండడం లేదని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

దీపికా అవుట్ - మేకర్స్ క్లారిటీ (Deepika Padukone Out From Kalki 2)

వైజయంతి మూవీస్ తమ X (Twitter) అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. ‘‘దీపికా పదుకునే కాల్కి 2 లో భాగం కారు. చాలా ఆలోచించి, మేము ఈ నిర్ణయం తీసుకున్నాం అంటూ తెలిపారు. మొదటి భాగాన్ని తెరకెక్కించేటప్పుడు చాల సుదీర్ఘ ప్రయాణం చేశాం. ఇలాంటి ఒక ప్రాజెక్ట్‌కి కావాల్సిన క‌మిట్‌మెంట్ మాకు ఆమె నుంచి కనిపించలేదు. ఆమె భవిష్యత్తు ప్రాజెక్టులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.’’ అని చెప్పింది ప్రొడక్షన్ హౌస్.

Also Read: డార్లింగ్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్.. 'ఫౌజీ' లో మరో స్టార్ హీరో ఎంట్రీ!

ఈ ప్రకటనతో చాలామంది ఆశ్చర్యపోయారు. అంతటి పెద్ద ప్రాజెక్ట్ నుంచి దీపికా బయటకి రావడం వెనుక కారణాలు ఏమిటి అన్న దానిపై సినీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. దీని ముందు కూడా ఆమె మరో ప్రభాస్ సినిమా ‘స్పిరిట్’ నుంచి తప్పుకున్నా సంగతి తెలిసిందే. ఆ సినిమాలో ఆమె షిఫ్ట్ డిమాండ్ చేసింది రోజుకు 8 గంటలు మాత్రమే పని చేస్తానని. ఈ విషయం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కు నచ్చక, ఆమెను తక్షణమే ప్రాజెక్ట్ నుంచి తీసేసినట్టు వార్తలు వచ్చాయి.

Also Read: Sootravakyam: ఓటీటీలో రికార్డులు దుల్లగొడుతున్న మలయాళ మూవీ.. ఆలస్యమెందుకు ఈ థ్రిల్లర్ మూవీ చూసేయండి!

కాల్కి విషయంలోనూ అదే?

ఇప్పుడు మళ్లీ కాల్కి 2 విషయంలోనూ అదే తరహా పరిస్థితులు ఏర్పడినట్టు తెలుస్తోంది. దీపికా టీం నుంచి వచ్చిన కొన్ని అసాధ్యమైన డిమాండ్లు మేకర్స్ కి నచ్చక, ఆమెను రీప్లేస్ చేయాలని నిర్ణయించుకున్నట్టు ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్. ప్రధానంగా, ఈ ప్రాజెక్ట్‌కు అవసరమైన స్థాయి క‌మిట్‌మెంట్ ఆమె చూపించలేకపోయిందనే విషయం ప్రొడక్షన్ టీం స్వయంగా చెప్పడం, ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.

Also Read: దుమ్మురేపుతున్న 'OG' సెన్సార్ టాక్.. ఊచకోతేనట..!

దీపికా రిప్లేస్‌మెంట్ ఎవరు?

ఇప్పుడు ముఖ్య ప్రశ్న ఏంటంటే దీపికా స్థానంలో ఎవరు రాబోతున్నారు? ఇంకా దీనిపై అధికారిక ప్రకటన రాలేదు కానీ, బాలీవుడ్ నుంచి మరో స్టార్ హీరోయిన్ ని తీసుకోవాలని మేకర్స్ చూస్తున్నట్టు సమాచారం. సినిమా ఆల్రెడీ కొన్ని డిలేస్ ఫేస్ చేస్తోంది. దీపికా సమస్యల వల్లా ఆలస్యం అయ్యే అవకాశం కూడా ఉంది.

ఒక్కసారి కాదు, రెండుసార్లు ప్రభాస్ సినిమాల నుంచి తప్పుకోవడం దీపికా కెరీర్ పై ప్రభావం చూపిస్తుందో చూడాలి. ఆమె పీఆర్ టీం డ్యామేజ్ కంట్రోల్ చేయాలని చూస్తున్నప్పటికీ, అసలు కారణం ఏమిటి అన్నదానిపై క్లారిటీ లేదు.

ఇంతకుముందు ప్రేక్షకులు ఎంతో ఇష్టపడ్డ ప్రభాస్-దీపికా కాంబినేషన్‌ను కాల్కి సీక్వెల్‌లో మిస్ అవ్వడం మాత్రం పక్కా.

Advertisment
తాజా కథనాలు