Sootravakyam: ఓటీటీలో రికార్డులు దుల్లగొడుతున్న మలయాళ మూవీ.. ఆలస్యమెందుకు ఈ థ్రిల్లర్ మూవీ చూసేయండి!

మలయాళ సినిమా సూత్రవాక్యం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా 100 మిలియన్ స్ట్రీమింగ్ రైట్స్‌ను సాధించింది. 

New Update
Soothravakyam

Soothravakyam

ఒకప్పుడు సౌత్‌లో మలయాళ సినిమాల ప్రసక్తి వచ్చేదికాదు.. కానీ ఇప్పుడు మలయాళ సినిమాలకు ఉన్న క్రేజ్ వేరే. తక్కువ బడ్జెట్‌తో వస్తున్న కొన్ని మలయాళ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీగా కలెక్షన్లను కొల్లగొడుతున్నాయి. మలయాళంలో సినిమాలు హిట్ కావడంతో కొన్నింటిని తెలుగులోకి కూడా రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో వచ్చిన మలయాళ సినిమాలు అన్ని కూడా దాదాపుగా హిట్ కొట్టినవే. అయితే మలయాళంలో వచ్చిన ఓ సినిమా థియేటర్లలో బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇప్పుడు మళ్లీ ఓటీటీలో దుల్లగొడుతుంది. మలయాళ సినిమా సూత్రవాక్యం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో మరో రికార్డును బద్దలు కొట్టింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా 100 మిలియన్ స్ట్రీమింగ్ రైట్స్‌ను సాధించింది. 

ఇది కూడా చూడండి: Bigg Boss Promo: బిగ్ బాస్ లో ట్రయాంగిల్ ట్రాక్ మొదలైందయ్యా.. లుక్స్ తోనే రొమాన్స్!

మైండ్ బ్లోయింట్ ట్విస్ట్‌లు..

యూజియాన్ జాస్ చిరమ్మల్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో షైన్ టామ్ చాకో, విన్సీ ఆలోషియస్, దీపక్ పరంబోర్, మీనాక్షి మాధవి, దివ్య ఎం.నాయర్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన శ్రీకాంత్.. యాక్టింగ్ కూడా చేశాడు. పవర్‌ఫుల్ రోల్‌లో నటించాడు. పోలీసు కాన్సెప్ట్‌లో వచ్చిన ఈ మూవీ అయితే హార్ట్ టచ్చింగ్‌గా ఉంది. ఎందుకంటే సినిమాలో కంటెంట్ పీక్స్‌లో ఉంది. పోలీస్ స్టేషన్‌కు నేరాలు చేసిన వారు, బాధితులు మాత్రమే ఎందుకు వెళ్లాలి? ఖాళీ సమయాల్లో పోలీసు సిబ్బంది స్కూల్ పిల్లలకు పాఠాలు ఎందుకు చెప్పకూడదు? పోలీసులను చూసి ఎందుకు భయపడాలి? అనే కోణంలో ఈ సినిమాను తీశారు. అన్ని విధాలుగా సినిమా అయితే అదిరిపోయింది. స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ, సంగీతం, ఎడిటింగ్ అంతా కూడా సూపర్‌గా ఉంది. మొదటి కొన్ని నిమిషాలు సినిమా నార్మల్‌గానే ఉంటుంది. కానీ ఆ తర్వాత వచ్చే కొన్ని సీన్లు అయితే గూస్ బంప్స్ అని మూవీ ప్రేక్షకులు అంటున్నారు. 

ఇది కూడా చూడండి: Mirai Box Office Collections: 'మిరాయ్' బాక్సాఫీస్ సెన్షేషన్.. 5 రోజుల్లోనే రూ. 100 కోట్లు!

Advertisment
తాజా కథనాలు