Ind-pak War: రేపటితో ముగియనున్న సీజ్ ఫైర్ ఒప్పందం

భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం రేపటితో ముగియనుంది. ఈనెల 10న మొదట ఒప్పందం చేసుకున్నారు. దాన్ని 18వ తేదీ వరకు పొడిగించారు. రేపు ఇరు దేశాల డీజీఎంఓల మధ్య హాట్ లైన్ ద్వారా మరోసారి చర్చలు జరిగే అవకాశం ఉంది. 

New Update
ind-pak

Ind-Pak ceasefire

పహల్గాం దాడి తరువాత భారత్, పాక్ ల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఉగ్రదాడిలో 26మంది టూరిస్టులు చనిపోయారు. దీనికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ ను మొదలుపెట్టింది. పాకిస్తాన్ లోని ఉగ్రస్థావరాల మీద దాడులు జరిపింది. ఇందులో దాదాపు 100మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది భారత ఆర్మీ. ఆపరేషన్ సింధూర్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఆర్మీ కూడా దాడులు జరిపింది. దీంతో ఇరు దేశాల మధ్యనా యుద్ధ వాతావరణం నెలకొంది. నాలుగు రోజుల పాటూ రెండు దేశాలూ ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నాయి. అయితే ఇది అణుయుద్ధానికి దారి తీస్తుందనే అనుమానాల మధ్యనా భారత్, పాక్ రెండు దేశాలూ కాల్పులు విరమణ ఒప్పందం చేసుకున్నాయి. 

రేపటితో గడువు ముగింపు..

ఈ నెల 10న భారత్, పాకిస్తాన్ రెండూ దేశాలూ మొదట కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నాయి. దాన్ని మళ్ళీ 18వ తేదీ అంటే రేపటి వరకు పొడిగించాయి. ఈ ఒప్పందం రేపటితో ముగియనుంది. ఈ క్రమంలో రెండు దేశాల డీజీఎంఓలు రేపు మరోసారి సీజ్ ఫైర్ గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది. హాట్ లైన్ ద్వారా చర్చలు జరుగుతాయని తెలుస్తోంది. ఇప్పుడు రేపు భారత్, పాక్ రెండూ కాల్పుల విరమణ పొడిగిస్తారా...ఒక వేళ పొడిగిస్తే ఎన్ని రోజులు ఎక్స్టెండ్ చేస్తారు అనే దానిపై ఉత్కంఠత నెలకొంది. ఇరు దేశాలు ప్రస్తుతానికే శాంతినే కోరుకుంటున్నాయి.  

today-latest-news-in-telugu | india | pakistan | ceasefire

Also Read: RCB VS KKR: జోష్ మళ్ళీ మొదలు..ఈరోజు నుంచి ఐపీఎల్ రీస్టార్ట్

Advertisment
తాజా కథనాలు