Coolie vs War 2 Collections: ఓపెనింగ్ వీకెండ్ దుమ్మురేపిన 'కూలీ'.. 200 కోట్ల క్లబ్​లోకి ఎంట్రీ!

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘కూలీ’ నాలుగు రోజుల్లోనే రూ.200 కోట్ల వసూళ్ల దిశగా దూసుకెళ్తోంది. ఆగస్ట్ 14న విడుదలైన ఈ సినిమా, మిక్స్‌డ్ టాక్ ఉన్నా ప్రేక్షకులను ఆకట్టుకుని, 'వార్ 2'తో పోటీ పడి టాప్ లో ఉంది. దీంతో రజినీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

New Update
Coolie vs War 2

Coolie

Coolie vs War 2 Collections: సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) నటించిన తాజా చిత్రం ‘కూలీ’ బాక్సాఫీస్(Coolie Box Office Collections) దగ్గర భారీ విజయాన్ని అందుకొని దుమ్మురేపుతోంది. విడుదలైన నాలుగో రోజుల్లోనే రూ.200 కోట్ల దిశగా దూసుకెళ్తోంది. ఆగస్ట్ 14న విడుదలైన ఈ సినిమా, మొదటి రోజు వచ్చిన మిక్స్డ్ టాక్ ని తట్టుకొని ప్రేక్షకులను ఆకట్టుకుంది, 'కూలీ' సక్సెస్ తో రజిని ఫ్యాన్స్ సినిమా థియేటర్ల వద్ద పండగ చేసుకుంటున్నారు.

ఈ సినిమా రిలీజ్ అయిన నాటి నుండి భారీ కలెక్షన్లను నమోదు చేస్తూ వస్తోంది. బాలీవుడ్ స్టార్‌లైన హృతిక్ రోషన్, జూ. ఎన్టీఆర్ నటించిన 'వార్ 2'(War 2)తో పోటీ ఉన్నా కూడా, ‘కూలీ’ మొదటి వారాంతంలోనే టాప్ కలెక్షన్స్ సాధించింది.

నాలుగు రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ లెక్కలివే..

'కూలీ' సినిమా నాలుగు రోజుల్లో దేశవ్యాప్తంగా రూ.193.25 కోట్లు వసూలు చేసింది. నాలుగో రోజు అయిన ఆదివారం ఒక్కరోజే రూ.34 కోట్లు వచ్చింది.  శనివారంతో పోలిస్తే కొద్దిగా తగ్గిన కలెక్షన్ అయినా కూడా, మొత్తానికి భారీ వసూళ్లే సాధించింది.

భాషల వారీగా చూస్తే, ‘కూలీ’ సినిమాకు తమిళ్ భాషలో అత్యధిక వసూళ్లు లభించాయి. తమిళనాడులో రజనీకాంత్‌కు ఉన్న క్రేజీ ఫాలోయింగ్ వల్ల, సినిమా అక్కడ భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. తెలుగు భాషలో కూడా సినిమా మంచి స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. హిందీ భాషలో మూడో స్థానంలో నిలిచిన ఈ సినిమా, నార్త్ లో కూడా హిట్ టాక్ తెచ్చుకొని ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కన్నడ భాషలో అయితే వసూళ్లు కొంచం తక్కువగా ఉన్నప్పటికీ, స్థిరంగా కొనసాగుతున్నాయి. అన్ని భాషలలోనూ సినిమా మంచి ఆదరణ పొందుతూ, బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులుపుతోంది.

Also Read:అప్పుడే పైరసీ ఏంట్రా.. 'కూలీ',  'వార్ 2' HD ప్రింట్ లీక్!

డే 1 to డే 4 కలెక్షన్స్..

1వ రోజు (గురువారం): ₹65 కోట్లు

తమిళ్ – ₹44.5 Cr

తెలుగు – ₹15.5 Cr

హిందీ – ₹4.5 Cr

కన్నడ – ₹0.5 Cr

2వ రోజు (శుక్రవారం): ₹54.75 కోట్లు

తమిళ్ – ₹34.45 Cr

తెలుగు – ₹13.5 Cr

హిందీ – ₹6.3 Cr

కన్నడ – ₹0.5 Cr

3వ రోజు (శనివారం): ₹39.5 కోట్లు

తమిళ్ – ₹25.75 Cr

తెలుగు – ₹9.5 Cr

హిందీ – ₹4.2 Cr

కన్నడ – ₹0.25 Cr

4వ రోజు (ఆదివారం): ₹34 కోట్లు

తమిళ్ – ₹22.5 Cr

తెలుగు – ₹6.5 Cr

హిందీ – ₹4.65 Cr

కన్నడ – ₹0.35 Cr

మొత్తం కలెక్షన్: ₹193.25 కోట్లు (నాలుగు రోజుల్లో)

Also Read:రికార్డులు బద్దలు కొట్టిన రజినీ .. ఒక్కరోజుకే రూ. 150 కోట్లు!

‘వార్ 2’ని బీట్ చేసిన ‘కూలీ’ (Coolie vs War 2)

‘కూలీ’తో పాటుగా రిలీజైన హృతిక్ రోషన్, జూ. ఎన్టీఆర్ ‘వార్ 2’ మొదటి వారం చివరికి ₹173.60 కోట్లు మాత్రమే వసూలు చేసింది. శనివారం, ఆదివారాల్లో వరుసగా ₹33.25 Cr, ₹31 Cr వసూలు చేసినా కూడా ‘కూలీ’ కంటే తక్కువగానే ఉంది.

ఈ కలెక్షన్స్ పరంగా చూస్తే, ‘కూలీ’ ఐదో రోజులోనే రూ.200 కోట్లు దాటి పోయే అవకాశముంది. రజనీకాంత్ అభిమానులకు కూలీ సక్సెస్ తో క్రాకర్స్ పేలుస్తూ, డ్యాన్స్‌లతో థియేటర్ల వద్ద సంబరాలు చేసుకుంటున్నారు. ఇక రాబోయే రోజుల్లో కూడా కూలీ కలెక్షన్స్ ఇదే జోరును కొనసాగించేలా కనిపిస్తోంది.

Also Read: 'కూలీ' బాక్సాఫీస్ రచ్చ.. మూడు రోజుల్లోనే ఎన్ని కోట్లంటే?


గమనిక: ఈ కథనంలో పేర్కొన్న బాక్సాఫీస్ కలెక్షన్ల సమాచారం ప్రముఖ ట్రేడ్ వెబ్‌సైట్లు, సోషల్ మీడియాలోని అధికారిక వర్గాల సోర్స్‌ల ఆధారంగా మాత్రమే అందించిన సమాచారం. నిజమైన డేటాలో స్వల్ప తేడాలు ఉండే అవకాశం ఉంది. 

Advertisment
తాజా కథనాలు