Coolie Collections: 'కూలీ' బాక్సాఫీస్ రచ్చ.. మూడు రోజుల్లోనే ఎన్ని కోట్లంటే?

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘కూలీ’ సినిమా రెండు రోజుల్లోనే వరల్డ్‌వైడ్‌గా ₹220 కోట్లు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ₹35 కోట్లు గ్రాస్ రాబట్టింది. హౌస్‌ఫుల్ షోలతో ఫ్యాన్స్ పండుగలా సెలబ్రేట్ చేస్తున్నారు.

New Update
Coolie Collections

Coolie Collections

Coolie Collections: సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) హీరోగా, లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘కూలీ’ సినిమా(Coolie Movie) ఆగస్ట్ 14న గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా ఓ రేంజ్‌లో రజనీ మార్క్ రాంపేజ్ చూపిస్తోంది. దేశవ్యాప్తంగా, ఓవర్సీస్‌లోనూ ‘కూలీ’ హవా కొనసాగుతుండగా, తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా కలెక్షన్లు(Coolie Movie Collections) అందుకుంటోంది.

Also Read: రికార్డులు బద్దలు కొట్టిన రజినీ .. ఒక్కరోజుకే రూ. 150 కోట్లు!

ఏపీ, తెలంగాణలో భారీ ఓపెనింగ్ (Coolie AP and Telangana Collections)

రజనీకాంత్‌కు తమిళనాడుతో పాటు తెలుగులోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే ఫస్ట్ డే నుంచే కూలీకి తెలుగు రాష్ట్రాల్లో రెస్పాన్స్ అదిరిపోయింది. మొదటి రోజు(Coolie Day 1 Collections) తెలుగు మార్కెట్‌లో రూ.20 కోట్లు, రెండవ రోజు(Coolie Day 2 Collections) రూ.15 కోట్లు కలెక్షన్లతో కూలీ ఫుల్ జోష్‌లో ఉంది.

ఏరియాల వారీగా కలెక్షన్లు ఇలా ఉన్నాయి:

నైజాం: ₹13 కోట్లు

సీడెడ్: ₹5 కోట్లు

ఉత్తరాంధ్ర: ₹3 కోట్లు

ఈస్ట్ గోదావరి: ₹3 కోట్లు

వెస్ట్ గోదావరి: ₹3 కోట్లు

గుంటూరు: ₹4 కోట్లు

కృష్ణా: ₹3 కోట్లు

నెల్లూరు: ₹1 కోటి

ఇలా మొత్తం కలిపి రెండు రోజుల్లో రూ.17 కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్, రూ.35 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. వీకెండ్ సపోర్ట్ కూడా ఉండడంతో, రానున్న రోజుల్లో ఈ సంఖ్యలు మరింత పెరిగే అవకాశం ఉంది.

Also Read: అప్పుడే పైరసీ ఏంట్రా.. 'కూలీ',  'వార్ 2' HD ప్రింట్ లీక్!

తెలుగు రైట్స్.. (Coolie Telugu Rights)

కూలీ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో భారీ ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగింది. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం, ఏషియన్ సునీల్ సమర్పణలో ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సినిమా తెలుగు రైట్స్‌ను దాదాపు ₹54 కోట్లకు (జీఎస్టీతో కలిపి) కొనుగోలు చేసినట్టు సమాచారం. దీంతో బ్రేక్ ఈవెన్ కావాలంటే సుమారు ₹55 కోట్ల షేర్, లేదా ₹110 కోట్ల గ్రాస్ అవసరం.

వరల్డ్ వైడ్ వసూళ్లు ఎలా ఉన్నాయి?

కూలీ మొదటి రోజు వరల్డ్‌వైడ్‌గా ₹155 కోట్లు, రెండవ రోజు ₹65 కోట్లు వసూలు చేసింది.

తమిళనాడు: ₹80 కోట్లు

తెలుగు రాష్ట్రాలు: ₹35 కోట్లు

హిందీ బెల్ట్: ₹15 కోట్లు

కర్ణాటక: ₹5 కోట్లు

ఓవర్సీస్: ₹85 కోట్లు

దీంతో రెండు రోజుల్లోనే సినిమా వరల్డ్ వైడ్‌గా ₹220 కోట్ల గ్రాస్, ₹118 కోట్ల షేర్ రాబట్టింది.

ఫ్యాన్స్ కి పండుగే..!

కూలీ సినిమాకు ప్రేక్షకుల్లో మంచి టాక్ వచ్చింది. థియేటర్లు హౌస్‌ఫుల్ షోలతో నిండిపోతున్నాయి. ఫ్యాన్స్ ఈ సినిమాను పండుగలా సెలబ్రేట్ చేస్తున్నారు. నాగార్జున విలన్‌గా, పూజా హెగ్డే స్పెషల్ సాంగ్‌ ఇలా సినిమాకు ప్రత్యేక ఆకర్షణలు చాలానే ఉన్నాయి. లొకేష్ కనగరాజ్ గత సినిమాలతో పోలిస్తే, ఇందులో ఉన్న కేమియోలు సినిమాకు చాలా బలంగా నిలిచాయంటూ పలువురు విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: 'కూలీ' ఇంటర్వెల్ ట్విస్ట్ కి మైండ్ బ్లాక్ భయ్యా.. సినిమా ఎలా ఉందంటే!

సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాకి సంగీతం అనిరుధ్ అందించగా, సినిమాటోగ్రఫీ గిరీష్ గంగాధరన్ అందించారు. ట్రేడ్ వర్గాల ప్రకారం, కూలీ మొత్తం బడ్జెట్ రూ.370 కోట్లు. ఇక ఈ స్థాయిలో రాబడులు కొనసాగితే, తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్(Coolie Movie Break Even) దాటడం ఖాయం అని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.

రజినీకాంత్ మళ్లీ తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో 'కూలీ' మూవీతో ప్రూవ్ చేశారు. 'కూలీ' సినిమాతో ప్రేక్షకుల్లో ఆయన మాస్‌ ఫాలోయింగ్ ఏ  రేంజ్ లో ఉందొ అర్ధమవుతోంది. ఇంకా వారం పూర్తి కాకముందే ₹150 కోట్లు చేరబోతున్న ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడం  ఖాయం!

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న బాక్సాఫీస్ కలెక్షన్ల సమాచారం ప్రముఖ ట్రేడ్ వెబ్‌సైట్లు, సోషల్ మీడియాలోని అధికారిక వర్గాల సోర్స్‌ల ఆధారంగా మాత్రమే అందించిన సమాచారం. నిజమైన డేటాలో స్వల్ప తేడాలు ఉండే అవకాశం ఉంది. 

Advertisment
తాజా కథనాలు