Coolie Box office collections day 1: లోకేష్ కనగరాజ్- సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబోలో భారీ అంచనాలతో విడుదలైన 'కూలీ' బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. రజినీ ఫ్యాన్స్ సినిమా సూపర్ అని అంటుండగా.. సినీ విశ్లేషకులు, సోషల్ మీడియా రివ్యూవర్లు మాత్రం 'కూలీ' పూర్తిగా నిరాశపరిచిందని చెబుతున్నారు. సినిమాలో రజినీ ఎలివేషన్స్, కొన్ని యాక్షన్ సీన్స్ తప్పా..కథ, కథనంలో బలం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాగార్జున, ఆమీర్ ఖాన్, ఉపేంద్ర వంటి స్టార్ క్యామియోలను వేస్ట్ చేశారని విమర్శలు వినిపిస్తున్నాయి.
Superstar Rajinikanth The Record Maker & Record Breaker 🔥🔥🔥#Coolie becomes the Highest ever Day 1 worldwide gross for a Tamil film with 151 Crores+#Coolie in theatres worldwide🌟@rajinikanth@Dir_Lokesh@anirudhofficial#AamirKhan@iamnagarjuna@nimmaupendra#SathyaRaj… pic.twitter.com/k3wLtIMqPn
— Sun Pictures (@sunpictures) August 15, 2025
'కూలీ' రికార్డు ఓపెనింగ్స్
అయితే 'కూలీ' కంటెంట్ పరంగా నిరాశపరిచినప్పటికీ.. కమర్షియల్ గా దుమ్మురేపుతోంది. సినిమాలోని స్టార్ క్యామియోలు, రజినీ బాక్సాఫీస్ స్టామినా కారణంగా రికార్డు ఓపెనింగ్స్ సాధించింది. తొలి రోజు 'కూలీ' ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. తమిళ సినిమా చరిత్రలో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. అంతేకాదు రజినీకాంత్ కెరీర్ లో కూడా బిగ్గెస్ట్ ఓపెనర్ గా రికార్డు క్రియేట్ చేసింది 'కూలీ'. ఇండియాలోనే కాకుండా ఓవర్ సీస్ లోనూ భారీ వసూళ్లను రాబట్టింది. ముఖ్యంగా నార్త్ అమెరికా, యూకే, ఆస్ట్రేలియాలో మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. నార్త్ అమెరికాలో కేవలం ప్రీమియర్ షోల ద్వారానే $2మిలియన్ వసూళ్లు రాబట్టింది. ఆగస్టు 15, వీకెండ్ కావడంతో రాబోయే రోజుల్లో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
లోకేష్ మార్క్
గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో ఒక గ్యాంగ్ స్టార్ డ్రామగా కూలీ చిత్రాన్ని రూపొందించారు. విక్రమ్, ఖైదీ వంటి సినిమాల్లో తన గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ఆకట్టుకున్న లోకేష్.. ' కూలీ 'లో ఆ మార్క్ చూపించలేదని తెలుస్తోంది. ఫస్ట్ ఆఫ్ కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉన్నప్పటికీ .. సెకండ్ ఆఫ్ ఫ్లాట్ గా, సాగదీతగా ఉందని అంటున్నారు.
ఇక విలన్ గా నాగార్జున పాత్ర ఫ్యాన్స్ ఆశించిన స్థాయిలో లేదని ఫ్యాన్స్ చెబుతున్నారు. చివరిలో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ క్యామియో కూడా ఊహించినంత హైప్ ఇవ్వలేదు. అమీర్ ఖాన్ లేకపోయినా పర్వాలేదు అనే ఫీలింగ్ కలిగించదని ప్రేక్షకుల అభిప్రాయం . అనిరుద్ మ్యూజిక్, రజినీ స్క్రీన్ ప్రజెన్స్, పాటలు మాత్రమే సినిమాలో పాజిటివ్స్ అని అంటున్నారు. ఇంకొంతమంది ఫ్యాన్స్ సినిమా సూపర్ అని అంటున్నారు. రజినీ ఫ్యాన్స్ కి ఇదొక మాస్ ఫీస్ట్ అని చెబుతున్నారు.