50 Years Of Rajinikanth: సినీ తారల నుంచి సీఎం వరకు.. సూపర్ స్టార్ కి సూపర్ విషెస్!

ఓవైపు 'కూలీ' రిలీజ్, మరోవైపు సూపర్ స్టార్ 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ ఇన్ ఇండస్ట్రీ.. ఎక్కడ చూసిన రజినీ మేనియా కనిపిస్తోంది. ఒక బస్ కండక్టర్ నుంచి సూపర్ స్టార్ వరకు రజినీకాంత్ ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తి!

New Update

RAJINIKANTH 50 YEARS:  ఓవైపు 'కూలీ' రిలీజ్, మరోవైపు సూపర్ స్టార్ 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ ఇన్ ఇండస్ట్రీ.. ఎక్కడ చూసిన రజినీ మేనియా కనిపిస్తోంది. ఒక బస్ కండక్టర్ నుంచి సూపర్ స్టార్ వరకు రజినీకాంత్ ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తి! ఈ ఏడాదితో రజినీ సినీ రంగంలో 50 సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు.

రజినీ 50 ఇయర్స్ 

ఈ సందర్భంగా ఆయన  50 ఏళ్ల సినీ ప్రయాణాన్ని సినీ ప్రియులు, అభిమానులు గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాల్లో, టీవీల్లో ఎక్కడ చూసిన తలైవా సందడే కనిపిస్తోంది. సామాన్యుల నుంచి సినీ తారలు, రాజకీయ నాయకుల వరకు అందరూ తమ అభిమానాన్ని తెలియజేస్తూ ఎక్స్ లో పోస్టులు పెడుతున్నారు.  170 కి పైగా సినిమాలు.. ఎన్నో బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ రికార్డులతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు తలైవా!  ఇప్పుడున్న ఎంతో మంది యంగ్ హీరోలకు కూడా స్ఫూర్తిగా నిలిచారు. సౌత్ లోనే కాదు దేశవ్యాప్తంగా రజినీజం స్రేడ్ చేశారు. సినీ ప్రపంచంలో ఆయన కరిష్మా, స్టైల్, స్వాగ్, ఫ్యాన్ బేస్ ఎండ్ లెస్! 

తలైవా 50 సంవత్సరాల సినీ ప్రయాణాన్ని పూర్తిచేసుకున్న పలువురు  సినీ తారలు తమ అభిమానాన్ని, కృతజ్ఞతను తెలియజేస్తూ పోస్టులు పెట్టారు! ఎవరూ ఏం పెట్టారో ఇక్కడ చూడండి! 

"అపూర్వ రాగంగళ్" అనే సినిమాలో ఒక చిన్న పాత్రలో రజినీకాంత్ తో కలిసి నటించాను అంటూ  కమల్  తమ మధ్య ఉన్న 50 సంవత్సరాల స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు. నా ప్రియమైన  మిత్రుడు రజినీకాంత్, ఈరోజు సినీ రంగంలో అర్ధ శతాబ్దం పూర్తి చేసుకున్నారు. నేను ఎంతో , అభిమానంతో నా సూపర్ స్టార్‌ని సెలబ్రేట్ చేసుకుంటున్నాను.  'కూలీ' గ్లోబల్ విజయం సాధించాలని కోరుకుంటున్నాను అంటూ రజినీకి విషెస్ తెలిపారు. 

మలయాళ సూపర్ స్టార్స్ మమ్ముట్టి, మోహన్ లాల్ కూడా రజినీకాంత్‌కి శుభాకాంక్షలు తెలిపారు. "50 ఏళ్ల అద్భుత సినీ సినీ ప్రయాణానికి రజినీకాంత్‌కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని తెలిపారు.  మీతో కలిసి నటించడం ఒక గౌరవం.. మీ కరిష్మా, అంకితభావం, మ్యాజిక్ అపరమైనవి అంటూ  శుభాకాంక్షలు ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. 

Advertisment
తాజా కథనాలు