COOLIE PIRACY: అప్పుడే పైరసీ ఏంట్రా.. 'కూలీ',  'వార్ 2' HD ప్రింట్ లీక్!

రజినీకాంత్ 'కూలీ' విడుదలై 24 గంటలు కూడా గడవకముందే పైరసీకి గురైంది. ఫుల్ సినిమాకు సంబంధించిన hd ప్రింట్ లింకులు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.

New Update

COOLIE PIRACY: ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో పైరసీ బెడద ఎక్కువైంది. సినిమా విడుదలై 24 గంటలు కూడా గడవకముందే..hd ప్రింట్ ఆన్ లైన్లో లీకవుతోంది. చిన్న హీరో,  స్టార్ హీరోల సినిమా అని తేడా లేకుండా విడుదలైన కొన్ని గంటల్లోనే  పైరసీ భూతానికి  బలవుతున్నాయి సినిమాలు. ఈ క్రమంలో నేడు విడుదలైన సూపర్ స్టార్ రజినీకాంత్  'కూలీ' ఎన్టీఆర్ 'వార్2' చిత్రాలు కూడా పైరసీకి గురయ్యాయి. సినిమాకు సంబంధించిన ఫుల్ hd ప్రింట్ ఆన్ లైన్లో లీకైంది.  టెలిగ్రామ్ గ్రూపుల్లో, పైరసీ వెబ్‌సైట్లలో సినిమా లింకులు దర్శనమిస్తున్నాయి. దీంతో సినీ నిర్మాతలు, అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో #StopPiracy అనే హ్యాష్‌ట్యాగ్‌తో నిరసన తెలియజేస్తున్నారు. థియేటర్లలో మాత్రమే సినిమాలు చూడాలని, పైరసీని ప్రోత్సహించవద్దని పోస్టులు పెడుతున్నారు. 

ఇదిలా ఉంటే కూలీ, వార్ 2 రెండూ భారీ బడ్జెట్ చిత్రాలు. బడ్జెట్‌తో నిర్మించిన పాన్-ఇండియా సినిమాలు. వందల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన ఈ సినిమాలకు పైరసీ వల్ల భారీ నష్టం వాటిల్లుతుంది. పైరసీ లీకవడం వల్ల చాలా మంది ప్రేక్షకులు సినిమాకు వెళ్లకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇది బాక్సాఫీస్ వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నిర్మాతలు పైరసీని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ఈ సమస్య ఆగడంలేదు. 

'కూలీ'

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన 'కూలీ' బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. లోకేష్ స్క్రీన్ ప్లే, రజినీ మార్క్ యాక్షన్, నాగ్ విలనిజం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక అనిరుధ్ బీజీఎం సినిమాకు మరో హైలైట్ గా నిలిచింది. అమీర్ ఖాన్, ఉపేంద్ర వంటి స్టార్ కాస్ట్ అతిథి పాత్రల్లో అలరించారు. మొత్తానికి 'కూలీ' ఒక రొటీన్ కథ అయినప్పటికీ.. లోకేష్ తన స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేశాడు. 

'వార్ 2'

ఇక ఎన్టీఆర్- హృతిక్  వార్ 2 కి మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ రోల్ ఆశించిన స్థాయిలో లేదని ఫ్యాన్స్ డిస్సపాయింట్ అవుతున్నారు. కొన్ని సన్నివేశాల్లో ఎన్టీఆర్ యాక్షన్ స్టెంట్లు మరీ అన్ రియలిస్టిక్ గా ఉన్నాయని అంటున్నారు. అలాగే సినిమాలో కిక్కిచ్చే పాటలు లేవని,  నేపథ్య సంగీతం కూడా అంతంత మాత్రమేనని చెబుతున్నారు. విజువల్ ఎఫెక్ట్స్, పూర్ స్క్రీన్ ప్లే సినిమాకు పెద్ద మైనస్ అని అంటున్నారు సినిమా చూసిన వారు. 

Also Read: War 2 Twitter Review: యాక్షన్ ప్రియులకు ఓకే కానీ..పాత సినిమాలో కొత్త క్యాస్టింగ్ అంతే..వార్ 2 ట్విట్టర్ రివ్యూ
Advertisment
తాజా కథనాలు