Chiranjeevi: ఈ ఏడాది ఆ ఘనత మెగాస్టార్ దే.. సంబరాలు షురూ

2026 సంవత్సరం టాలీవుడ్‌కి ఒక అదిరిపోయే శుభారంభాన్ని ఇచ్చింది.  ప్రభాస్ 'రాజాసాబ్' కాస్త నిరాశపరిచినప్పటికీ..    మన శంకర వరప్రసాద్ అదిరిపోయే రెస్పాన్స్ తో ఈ ఏడాది మోసాటి బోనీ కొట్టింది.

New Update
Mana Shankara Vara Prasad Garu

Mana Shankara Vara Prasad Garu

2026 సంవత్సరం టాలీవుడ్‌కి ఒక అదిరిపోయే శుభారంభాన్ని ఇచ్చింది.  ప్రభాస్ 'రాజాసాబ్' కాస్త నిరాశపరిచినప్పటికీ..    మన శంకర వరప్రసాద్(Mana ShankaraVaraprasad Garu) అదిరిపోయే రెస్పాన్స్ తో ఈ ఏడాది మోసాటి బోనీ కొట్టింది. మెగాస్టార్ తన వింటేజ్ కామెడీ పవర్‌తో బాక్సాఫీస్‌ను సొంతం చేసుకున్నాడు. తన కామెడీ టైమింగ్, ఎనర్జీ, మేనేరిజమ్స్ తో అభిమానులను ఉర్రూతలూగించారు. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తుంటే థియేటర్లు విజిల్స్‌తో దద్దరిల్లుతున్నాయి. "వింటేజ్ మెగాస్టార్ ఈజ్ బ్యాక్" అని సంబరాలు చేసుకుంటున్నారు ఫ్యాన్స్. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ  'మన శంకర వరప్రసాద్' 2026 లో మొదటి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసే పక్కా 'పండగ బొమ్మ' అనిపించుకుంటుంది. 

వింటేజ్ మెగాస్టార్ ఈజ్ బ్యాక్

'సైరా నరసింహారెడ్డి' తర్వాత మళ్ళీ చాలా కాలానికి  మెగాస్టార్ కి మరో సరైన హిట్టు పడింది.  పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన 'మన శంకర వరప్రసాద్' పాత మెగాస్టార్ ను గుర్తుచేస్తుంది. ఆయన ఫ్రీ-ఫ్లో కామెడీ, ఆ ఎనర్జీ, మేనరిజమ్స్, డాన్స్, గ్రెస్, స్టైల్ అదిరిపోయాయి. సీరియస్ రోల్స్ పక్కన పెట్టి, ఒక పూర్తి స్థాయి ఎంటర్టైనర్‌గా ఆయన పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఉత్సాహపరిచింది. - Blockbuster Mana Shankara Vara Prasad Garu Movie Review

అనిల్ మార్క్ ఎంటర్ టైనమెంట్ 

అనిల్ రావిపూడి చిరు ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని, ఆయన కామెడీ యాంగిల్‌ను పర్ఫెక్ట్‌గా వాడుకున్నారని తెలుస్తోంది. మెగాస్టార్ కూడా తన పర్ఫార్మెన్స్ తో సినిమా మొత్తాన్ని తన భుజాల పై నడిపించారు.చాలా రోజుల తర్వాత  ఆయనలోని ఆ పాత ఎనర్జీని చూడటం ప్రేక్షకులకు కళ్ళకు పండుగలా అనిపించింది. 

వెంకీ మామ క్యామియో

సినిమాలో వెంకీ మామ స్పెషల్ అట్రాక్షన్ మరో హైలైట్ గా నిలిచింది.  మెగాస్టార్ కామెడీకి వెంకీ తోడవ్వడం  సినిమా రేంజ్ ను పెంచేసింది. ఇద్దరు సీనియర్ హీరోలను ఒకే స్క్రీన్ మీద చూడటం ఆడియన్స్‌కి పెద్ద బూస్ట్ ఇచ్చింది. - Tollywood news updates

Also Read: Mana Shankara Vara Prasad Garu Movie Review: మన శంకర వరప్రసాద్ గారు మెప్పించారా? లేదా?

Advertisment
తాజా కథనాలు