/rtv/media/media_files/2025/02/01/d5XtKCLYXousk5blgbsV.jpg)
sai pallavi health
Sai Pallavi: నటి సాయి పల్లవి తండేల్ మూవీకి సంబంధించిన పలు ప్రమోషనల్ ఈవెంట్స్ కి హాజరు కాకపోవడంపై నిర్మాత అల్లు అరవింద్ ఇప్పటికే రెస్పాండ్ అవ్వగా.. డైరెక్టర్ చందూ మొండేటి మరోసారి స్పందించారు. సాయి పల్లవి కొన్నిరోజులుగా జ్వరం, జలుబుతో ఇబ్బంది పడుతున్నారు. అయినప్పటికీ ఆమె పలు ఈవెంట్లలో పాల్గొన్నారు. దీంతో మరింత నీరసించిపోయారు. ఈ క్రమంలో వైద్యులు ఆమెకు కనీసం రెండు రోజుల పాటు బెడ్ రెస్ట్ అవసరమని సూచించినట్లు తెలిపారు.
Also Read: Suryapet Murder: చంపింది నాన్నమ్మనే.. ప్రైవేట్ పార్ట్స్‌ను కసితీరా తొక్కి.. భార్గవి సంచలన నిజాలు!
ఫిబ్రవరి 7న విడుదల
చందూ మొండేటి దర్శకత్వంలో సాయి పల్లవి, నాగచైతన్య హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తండేల్'. శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో మత్స్యకారుల వాస్తవిక సంఘటన ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. వేటకు సముద్రంలోకి వెళ్లిన తన ప్రియుడి కోసం ఎదురుచూస్తున్న బుజ్జితల్లిగా సాయిపల్లవి కనిపించనుంది. 'లవ్ స్టోరీ' తర్వాత నాగచైతన్య- సాయి పల్లవి కాంబోలో రాబోతున్న ఈమూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులలో ఆసక్తిని పెంచేశాయి.
Also Read: Vijay Sethupathi: తమిళంలో పాన్ కార్డు మార్చాలి.. స్టార్ హీరో రిక్వెస్ట్ .. ఎందుకిలా?
నాగచైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్
అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రకాష్ బెలవాడి, కరుణాకరన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దాదాపు రూ. 75 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన 'తండేల్' నాగ చైతన్య కెరీర్‌లో ఇది అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్. ఇటీవలే సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి బోర్డు U/A సెర్టిఫికెట్ ఇచ్చింది. 2 గంటల 32 నిమిషాలుగా మూవీ రన్ టైం ఫిక్స్ అయ్యింది.
Also Read: Thandel Movie: తండేల్ లో ఆ ఒక్క ఎపిసోడ్ కోసం రూ.18 కోట్లు ఖర్చు చేశారట.. ఏంటో తెలిస్తే షాకే !