/rtv/media/media_files/2025/01/30/7oG0B2F2nR1BCBKgQfTD.jpg)
Thandel Movie
Thandel Movie: నాగచైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ తండేల్. శ్రీకాకుళం జిల్లా డి.మత్స్యలేశం బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ మూవీ ఫిబ్రవరి 7న విడుదల కానుంది. అయితే తాజాగా ఈమూవీ ప్రమోషన్స్ పాల్గొన్న డైరెక్టర్ చందూ మొండేటి సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు
Also Read: Vijay Sethupathi: తమిళంలో పాన్ కార్డు మార్చాలి.. స్టార్ హీరో రిక్వెస్ట్ .. ఎందుకిలా?
ఒక ఎపిసోడ్ కోసం రూ.18 కోట్లు
తండేల్ సినిమాలో ఒక ఎపిసోడ్ కోసం రూ.18 కోట్లు బడ్జెట్ ఖర్చు చేసినట్లు చందూ మొండేటి తెలిపారు. అయితే ముందుగా సినిమాకు సంబంధించిన రీసెర్చ్ తర్వాత చందూ కథ రాయడం పూర్తి చేశారట. ఆ తర్వాత హీరో బాడీ ల్యాంగ్వేజ్ ఎలా ఉంటే బాగుంటుంది అనేది టెస్ట్ చేయడానికి మళ్లీ డి.మత్స్యలేశం వెళ్లగా.. అదే సమయంలో ఈ కథకు సంబంధించి ఇంకా కొన్ని విషయాలను అక్కడి వారిని అడిగి తెలుసుకున్నారట. అప్పుడు వారు సముద్రంలో చోటుచేసుకున్న తుపాను, ఆ సమయంలో మత్య్సకారులు ఎలాంటి సమయస్ఫూర్తిని కనబరిచారు వంటి విషయాలను చెప్పారు. దీంతో అప్పటికే రాయడం పూర్తయిన కథకు బడ్జెట్ ఫిక్స్ అయినప్పటికీ.. ఇలాంటి తుఫాన్ విజువల్స్, సన్నివేశాలు ఉంటే కథకు బాగుంటుందని భావించి.. నిర్మాతలకు చెప్పగా అంగీకరించారట. అలా ఈ ఒక్క ఎపిసోడ్‌కే రూ.18 కోట్లు బడ్జెట్ ఖర్చు చేసినట్లు తెలిపారు. డి.మత్స్యలేశం గ్రామానికి చెందిన పలువురు మత్స్యకారులు వేటకు వెళ్లి..అక్కడ పాకిస్థాన్ కోస్ట్ గార్డుకు చిక్కిన తర్వాత జరిగే సంఘటనల నేపథ్యంలో కథ ఉంటుంది.
U/A సర్టిఫికేట్
గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవలే U/A సర్టిఫికేట్ తో ఈ మూవీ సెన్సార్ కూడా పూర్తిచేసుకుంది. మొత్తం 2 గంటల 32 నిమిషాల రన్ టైంతో సినిమా రాబోతుంది. లవ్ స్టోరీ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చైతన్య, పల్లవి కాంబోలో వస్తున్న తండేల్ ఫ్యాన్స్ లో అంచనాలు భారీగా ఉన్నాయి.
Also Read: Suryapet Murder: చంపింది నాన్నమ్మనే.. ప్రైవేట్ పార్ట్స్‌ను కసితీరా తొక్కి.. భార్గవి సంచలన నిజాలు!