Pawan Kalyan: మేనల్లుడికి డిప్యూటీ సీఎం అదిరిపోయే విషెస్! ఏం చెప్పారో చూడండి

మెగా హీరో సాయి దుర్గ తేజ్ ఈరోజు తన 38వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సినీ తారలు, అభిమానులు తేజ్ కి బర్త్ డే విషెష్ తెలియజేస్తున్నారు.

New Update
pawan kalyan

pawan kalyan

Pawan Kalyan: మెగా హీరో సాయి దుర్గ తేజ్ ఈరోజు తన 38వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సినీ తారలు, అభిమానులు తేజ్ కి బర్త్ డే విషెష్ తెలియజేస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మేనల్లుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా ఒక స్పెషల్ నోట్ షేర్ చేశారు.

సాయిదుర్గ తేజ్ కి జన్మదిన శుభాకాంక్షలు

''యువ కథానాయకుడు సాయిదుర్గ తేజ్ కి జన్మదిన శుభాకాంక్షలు. కష్టే ఫలి అనే మాటను చిత్తశుద్ధితో ఆచరించే తత్వం తేజ్ కి ఉంది. చిత్ర పరిశ్రమలోకి వచ్చిన తొలి రోజు నుంచీ ప్రతి దశలో ఎంతో తపనతో నటిస్తున్నాడు. సామాజిక స్పృహ కలిగిన యువకుడు. వర్తమాన అంశాలపై స్పందిస్తూ... రహదారి భద్రత, సోషల్ మీడియాలో అపసవ్య ధోరణులపై చైతన్యపరుస్తున్నాడు. సాయిదుర్గ తేజ్ కథానాయకుడిగా విజయాలు అందుకోవాలని, భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకొంటున్నాను.'' అంటూ ట్వీట్ చేశారు పవర్ స్టార్. 

Also Read: Sai Marthand: మహేష్ బాబుతో లవ్ స్టోరీ చేస్తా.. 'లిటిల్ హార్ట్స్' డైరెక్టర్ వైరల్ కామెంట్స్..!

Advertisment
తాజా కథనాలు