/rtv/media/media_files/2025/01/19/8GcaoBRU3RrGhNq45YPj.jpg)
Saif ali khan suspect arrested Photograph: (Saif ali khan suspect arrested)
బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ దాడి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. తాజాగా ముంబై పోలీసులు (Mumbai Police) నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ ను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అనంతరం ఆదివారం మధ్యాహ్నం మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చారు. విచారణ జరిపిన కోర్టు షెజాద్‌ను 5 రోజుల పోలీసు కస్టడీలో ఉంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం నిందితుడిని బాంద్రా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో సైఫ్ దాడికి సంబంధించి మరికొన్ని కొత్త విషయాలు బయటకు వచ్చాయి. సైఫ్ పై దాడి తర్వాత నిందితుడు ఎక్కడి వెళ్ళాడు? ఏం చేశాడు? ఎక్కడ ఉన్నాడు అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read : దాడి కేసులో కీలక మలుపు.. అసలైన నిందితుడు అరెస్టు
దాడి తర్వాత అక్కడికి వెళ్లి హాయిగా నిద్ర..
అయితే జనవరి 16న 3 గంటల ప్రాంతంలో సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) పై దాడి తర్వాత.. నిందితుడు ఆ రోజు ఉదయం 7 గంటల వరకు బాంద్రాలోని ఉన్నాడని.. అక్కడే ఓ బస్ స్టాప్ లో నిద్రించాడని పోలీస్ అధికారులు తెలిపారు. ఆతర్వాత రైలు ఎక్కి వర్లీ చేరుకున్నట్లు వెల్లడించారు. బంగ్లాదేశ్ పౌరుడైన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజాద్ భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించాడని. తన పేరును బిజోయ్ దాస్‌గా మార్చుకుని గత ఆరు నెలల నుంచి ముంభైలో నివాసం ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. అలాగే అతడితో దేశానికి సంబంధించిన ఎలాంటి గుర్తింపు కార్డు కూడా లేదని పేర్కొన్నారు.
Also Read : సైఫ్‌పై దాడి.. అర్థరాత్రి ఏం జరిగిందంటే.. వెలుగులోకి షాకింగ్ నిజాలు
నిందితుడి బ్యాగ్‌లో..
పోలీసుల విచారణలో నిందితుడి బ్యాగు నుంచి సుత్తి, స్క్రూడ్రైవర్, నైలాన్ తాడుతో పాటు పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడి బ్యాగ్‌లో ఇలాంటివి కనిపించడంతో అతడికి నేరచరిత్ర ఉండి ఉంటుందని అనుమానిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే నిందితుడికి తాను దాడి చేసింది సైఫ్ అలీఖాన్ పై అని తెలియదని అధికారులు చెబుతున్నారు. టీవీ, సోషల్ మీడియా పోస్ట్‌లలో వచ్చిన వార్తలు చూసిన తర్వాతే తాను దాడి చేసింది సైఫ్ అలీఖాన్ పై అని నిందితుడికి తెలిసినట్లు సమాచారం.
ఇది కూడా చూడండి: Horoscope: నేడు ఈ రాశి వారు వారికి చాలా దూరంగా ఉండాలి..లేకపోతే ఇక అంతే సంగతులు