Bigg Boss 9 Dammu Srija Elimination: బిగ్‌బాస్‌పై విరుచుకుపడుతున్న నెటిజన్లు.. ఓట్లకు విలువ లేదంటూ ఫైర్..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి ఈ వారం ఫ్లోరా షైనీ, దమ్ము శ్రీజ ఎలిమినేట్ అయ్యారు. అయితే శ్రీజ ఎలిమినేట్ అన్ ఫైర్ అని, ఇంకా మేం ఓట్లు ఎందుకు వేయడం అని నెటిజన్లు బిగ్ బాస్‌పై ఫైర్ అవుతున్నారు.

New Update
Srija Dammu

Srija Dammu

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రస్తుతం చెప్పుకోదగ్గ రసవత్తరంగా అయితే సాగడం లేదు. అయితే ఈ వారం ఆరుగురు వైల్డ్ కార్డులు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. సీరియల్ నటుడు నిఖిల్ నాయర్, నటి అయేషా జీనథ్, శ్రీనివాస్ సాయి,  గౌరవ్ గుప్తా, దివ్వెల మాధురి, అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్ రమ్య మోక్ష వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ అయ్యారు. అయితే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఇద్దరిని ఎలిమినేట్ చేశారు. నటి ఫ్లోరా, అగ్నిపరీక్ష ద్వారా వచ్చిన శ్రీజ ఎలిమినేట్ అయ్యారు. అయితే ఫ్లోరా ఆటలో కానీ కంటెంట్ ఇవ్వడంలో కాస్త వెనుకనే ఉందని చెప్పవచ్చు. దీనికి తోడు ఆమెకు ఓటింగ్స్ కూడా తక్కువగా వచ్చాయని ఎలిమినేట్ చేశారు. అయితే ఈ వారం టాస్క్‌లు ఆడి డేంజర్ జోన్‌లో సుమన్ శెట్టి, దమ్ము శ్రీజలో ఒకరిని వైల్డ్ కార్డు ఎంట్రీ వారితో ఓటింగ్ పెట్టారు.

ఇది కూడా చూడండి: Venkatesh: "మన శంకర వరప్రసాద్ గారు" క్రేజీ అప్‌డేట్.. పండక్కి ఇంక రచ్చ రచ్చే..!

దమ్ము శ్రీజను ఎలిమినేట్ చేయడంతో..

వీరిలో శ్రీజకు సపోర్ట్ రాకపోవడంతో ఆమెను ఎలిమినేట్ చేశారు. దీంతో  నెటిజన్లు బిగ్ బాస్‌పై ఫైర్ అవుతున్నారు. అసలు ఓటింగ్ ఎందుకు, మేం ఓట్లు ఎందుకు వేయడం వేస్ట్ అని కామెంట్లు చేస్తున్నారు. బిగ్ బాస్‌కు నచ్చినవారిని హౌస్‌లో ఉంచి, మిగతా వారిని పంపించేందుకు ఎందుకు ఓట్లు అని మండిపడుతున్నారు. దమ్ము శ్రీజ టాస్క్‌లో అన్నింట్లో బాగా ఆడుతుందని నెటిజన్లు అంటున్నారు. తన 100 శాతం ఎఫోర్ట్స్ పెడుతుందని, కానీ బిగ్ బాస్ శ్రీజను ఎలిమినేట్ చేయడం అన్యాయం అని అంటున్నారు. మంచిగా ఆడే కంటెస్టెంట్‌లను ఎలిమినేట్ చేస్తే ఇంకా ఎందుకు బిగ్ బాస్ చూడటం అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మరి ఈ వైల్డ్ కార్డు ఎంట్రీస్ వల్ల అయినా ఈ సీజన్ బిగ్ బాస్ రసవత్తరంగా సాగుతుందో లేదో చూడాలి. 

ఇది కూడా చూడండి: Devara on TV: 'దేవర పార్ట్ 1' టీవీ టెలికాస్ట్ రెడీ - పూర్తి వివరాలు ఇవే!

Advertisment
తాజా కథనాలు