Venkatesh: "మన శంకర వరప్రసాద్ గారు" క్రేజీ అప్‌డేట్.. పండక్కి ఇంక రచ్చ రచ్చే..!

మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ కలిసి నటిస్తున్న "మన శంకర వరప్రసాద్ గారు" సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. వెంకటేష్ అక్టోబర్ 21 నుండి షూటింగ్‌లో చేరుతారు. ఇప్పటికే “మీసాల పిల్ల” పాట ప్రోమోకి మంచి స్పందన లభించింది.

New Update
Venkatesh

Venkatesh

Venkatesh: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా “మన శంకర వరప్రసాద్ గారు”(Mana Shankara Varaprasad Garu) ఇప్పటికే సినీప్రేక్షకుల్లో భారీ ఆసక్తి రేపుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నయనతార నటిస్తుండగా, మరో స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో చేరబోతున్న విషయం తాజాగా బయటకు వచ్చింది.

వెంకటేష్ 2025 అక్టోబర్ 21 నుండి షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఆయన పాత్ర సినిమాలో ప్రధానంగా కామెడీ, ఎమోషనల్ ఎలిమెంట్స్‌ను తీసుకురానుందని చెబుతున్నారు. చిరంజీవి, వెంకటేష్ ఇద్దరూ స్క్రీన్‌పై కలసి కనిపించబోతుండటం విశేషం. వీరిద్దరి మధ్య సీన్స్ సినిమాకు హైలైట్‌గా మారే అవకాశముంది.

Also Read :  కాకరేపుతున్న 'కట్టలన్' ఫస్ట్ లుక్ .. రక్తంతో పోస్టర్ వైరల్!

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. ముఖ్యంగా దసరా సందర్భంగా విడుదల చేసిన "మీసాల పిల్ల" పాట ప్రోమోకి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ ప్రోమోలో చిరంజీవి - నయనతార(Chiranjeevi - Nayanthara) మధ్య వినోదంగా సాగిన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రోమోలో చూపించిన ఎనర్జీ చూసి, ఫుల్ సాంగ్ కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

త్వరలోనే ఫుల్ సాంగ్..

ఈ పాటను ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ పాడగా,మ్యూజిక్ అందరిని ఆకట్టుకుంటుంది. సరళమైన పదాలతో, పల్లవితో పాట ఆడియన్స్ ను అట్ట్రాక్ట్ చేసింది. సినిమాకు ఇది ఓ మంచి ప్రమోషనల్ బూస్ట్‌గా మారిందని చెప్పాలి. త్వరలోనే పూర్తి పాటను విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం తెలిపింది.

చిరంజీవి ఈ సినిమాలో కొత్త గెటప్‌లో కనిపించనున్నారు. ఆయన పాత్ర మాస్,  క్లాస్ కలిపి ఉండనుందని టాక్. నయనతార పాత్ర కూడా ప్రత్యేకంగా ఉండనుందట. ఇప్పటివరకు విడుదలైన ఫస్ట్ లుక్స్, గ్లింప్స్ అన్నీ కూడా పాజిటివ్ బజ్‌ను తీసుకొచ్చాయి.

ఈ సినిమా సంక్రాంతి 2026 విడుదలకు సిద్ధమవుతోంది. పండగ సినిమాగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమా టీమ్ జాగ్రత్తలు తీసుకుంటోంది. వెంకటేష్ పాత్ర, చిరంజీవితో ఆయన కలయిక సినిమాకు అదనపు ఆకర్షణగా నిలవబోతోంది.

కథలో మిగతా పాత్రలు కూడా బలంగా ఉండేలా ప్లాన్ చేశారని తెలుస్తోంది. సంగీతం, కామెడీ, ఎమోషన్, స్టైల్ అన్నీ కలిపిన పక్కా సంక్రాంతి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.

Advertisment
తాజా కథనాలు