Devara on TV: 'దేవర పార్ట్ 1' టీవీ టెలికాస్ట్ రెడీ - పూర్తి వివరాలు ఇవే!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర పార్ట్ 1 టీవీలో ప్రసారం కావడానికి సిద్ధం అయింది. దాదాపు ఏడాది తర్వాత Jio Star హక్కులు పొందగా, హిందీ ప్రీమియర్ అక్టోబర్ 26న జరగనుంది. మిగతా భాషల్లో కూడా త్వరలో ప్రసారం కానుంది.

New Update
Devara on TV

Devara on TV

Devara on TV: యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ చిత్రం "దేవర: పార్ట్ 1" ఎట్టకేలకు బుల్లి తెరపైకి రావడానికి సిద్ధంగా ఉంది. గత ఏడాది సెప్టెంబరులో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా డిజిటల్‌లో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నా, టీవీలో మాత్రం ఇప్పటి వరకు ప్రసారం కాలేదు.

ఇటీవల కాలంలో సినిమాలు విడుదలైన కొన్ని వారాల్లోనే టీవీ లేదా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోకి వచ్చేస్తున్నాయి. కానీ దేవర మాత్రం అందుకు భిన్నంగా, దాదాపు ఏడాది తరువాత టెలివిజన్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Also Read: "మన శంకర వరప్రసాద్ గారు" క్రేజీ అప్‌డేట్.. పండక్కి ఇంక రచ్చ రచ్చే..!

Also Read :  కాకరేపుతున్న 'కట్టలన్' ఫస్ట్ లుక్ .. రక్తంతో పోస్టర్ వైరల్!

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌..

ఈ చిత్రంలో ఎన్టీఆర్‌తో పాటు జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్ ముఖ్య పాత్రల్లో నటించారు. థియేటర్లలో బాగానే ఆడిన ఈ సినిమా, తరువాత నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. అక్కడ కూడా మంచి ట్రెండింగ్‌లో నడిచింది. అయితే టీవీ హక్కుల విషయంలో మాత్రం కొన్ని జాప్యాలు జరిగాయి.

ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, శాటిలైట్ హక్కుల ధరలపై చర్చలు, సాటిలైట్ డిమాండ్ తక్కువగా ఉండటం, సరైన ఫెస్టివల్ స్లాట్ కోసం ఎదురు చూడటం వంటివే ఆలస్యానికి కారణమని తెలుస్తోంది.

ఇప్పుడు, ఈ సినిమా అన్ని భాషల శాటిలైట్ హక్కులను Jio Star సొంతం చేసుకుంది. అందులో భాగంగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో వేర్వేరు ఛానళ్లలో ప్రసారంకాబోతోంది.

  • తెలుగులో - Star Maa
  • హిందీలో - Star Gold
  • తమిళంలో - Vijay TV
  • కన్నడలో - Star Suvarna
  • మలయాళంలో - Asianet

ఇందులో హిందీ ప్రీమియర్ అక్టోబర్ 26న ఖరారు అయింది. మిగతా భాషల తేదీలు త్వరలోనే ప్రకటించనున్నారు.

ఇది ఒక్క ప్రీమియర్‌ మాత్రమే కాదు, దేవర పార్ట్ 2 కోసం బలమైన పునాది కూడా. ఎందుకంటే, ఈ సినిమా ఫ్రాంచైజీగా రూపొందుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం కథను రెండో భాగంలో కొనసాగించనున్నారు. ప్రస్తుతం పార్ట్ 2 ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. ఎన్టీఆర్, తన తదుపరి సినిమా "డ్రాగన్" పూర్తి చేసిన తర్వాత పార్ట్ 2 షూటింగ్ ప్రారంభించనున్నారు.

దేవర మొదటి భాగం ఇప్పుడు టీవీలలో వస్తుండడంతో ఎన్నో రోజుల అభిమానుల ఎదురుచూపులకు తెరపడింది. దేవర సీక్వెల్‌కు బలమైన బజ్ క్రియేట్ చేసేందుకు ఈ టెలికాస్ట్ ఉపయోగపడనుంది.

Advertisment
తాజా కథనాలు