టాలీవుడ్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా 'పుష్ప2' టికెట్ రేట్లను పెంచిన విషయం తెలిసిందే. సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్ లలో సినిమా చూడాలంటే కనీసం రూ.1000 అయినా ఉండాల్సిందే. ఈ టికెట్ రేట్ల వల్ల చాలా మంది ఆడియన్స్ సినిమాను థియేటర్స్ లో చూడలేకపోతున్నారు. ఇప్పుడు వాళ్ళ కోసమే టికెట్ రేట్లను తగ్గించనున్నారట మేకర్స్. నిన్న రాత్రి జరిగిన 'పుష్ప2' సక్సెస్ మీట్ లో నిర్మాత రవిశంకర్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అందరూ టికెట్ రేట్ ఏదో 800.. 800 అనుకుంటున్నారని, కానీ ఆ ధర కేవలం ప్రీమియర్ షో వరకూ మాత్రమే ఉందని చెప్పారు. ఆ ఒక్క షోకే 800 ఉందని, అది అయిపోయిందని.. ఇక నుంచి అందుబాటు ధరలోనే పుష్ప–2 టికెట్స్ ఉంటాయని నిర్మాత చెప్పారు. The tickets rates for #Pushpa2TheRule are nominal all over. Audiences can enjoy the film with their families in theatres.#Pushpa2TheRule RULING IN CINEMAS #Pushpa2#WildFirePushpaIcon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP @resulp @NavinNooli… pic.twitter.com/M4yutNBZGL — Mythri Movie Makers (@MythriOfficial) December 7, 2024 Also Read : 'పుష్ప2' గంగమ్మ తల్లీ జాతర సీన్.. థియేటర్ లో పూనకాలతో ఊగిపోయిన మహిళ సోమవారం నుంచి.. ఈ వీకెండ్ నుంచి 'పుష్ప2' టికెట్ రేట్లు సింగిల్ స్క్రీన్ అయినా.. బాల్కనీ 350 ప్లస్ ట్యాక్స్ (టోటల్ 390 రూపాయలు), ఫస్ట్ క్లాస్ 250 ప్లస్ ట్యాక్స్ (టోటల్ 283 రూపాయలు), సెకండ్ క్లాస్ 150 ప్లస్ ట్యాక్స్ (173 రూపాయలు) ఉండనున్నాయి. సోమవారం నుంచి పుష్ప–2 టికెట్ ధరలను తగ్గించే అవకాశం ఉంది. అప్పుడు కూడా మాములుగా ఉండే రేట్ల కంటే యాభైనో, వందనో ఎక్కువే ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. Also Read : డబ్బులు తక్కువిచ్చినా పర్లేదు కానీ ఫ్రీగా ఆ పని చేయను.. రష్మిక షాకింగ్ కామెంట్స్