'పుష్ప2' సినిమాకు థియేటర్స్ అంతా షేక్ అయిపోతున్నాయి. సినిమాలో అల్లు అర్జున్ నటనకు ఆడియన్స్ దాసోహం అవుతున్నారు. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే గంగమ్మ తల్లి జాతర సీక్వెన్స్ అందులో అల్లు అర్జున్ నటనకు ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువేనని, థియేటర్స్‌లో జాతర ఎపిసోడ్ చూస్తే మాత్రం గూస్‌బంప్స్ గ్యారెంటీ అంటూ కొందరు షేర్ చేస్తోన్న వీడియోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. తాజాగా పుష్ప 2 ప్రదర్శిస్తోన్న థియేటర్ లో ఓ మహిళకు.. జాతర ఎపిసోడ్ రాగానే నిజంగానే పూనకం వచ్చింది. అమ్మవారు పూనడంతో సీట్లో కూర్చొనే గట్టిగా కేకలు వేస్తూ ఊగిపోయింది. అదే సందర్భంలో మరో మహిళ కూడా జాతర సీన్ చూసి.. పూనకం వచ్చినట్లుగా వింత వింతగా ప్రవర్తించింది. Neekanna Peddha Dhikku... Lokaana YekkadundhiNaivedhyam Ettanga... Maa Kaada YemitundhiMoralanni Aaalakinchi... Varameeyyave Thalli 🙏🙏🙏GANGO RENUKA THALLI 🙏🙏🙏 https://t.co/shS1a4rYvH — Mythri Movie Makers (@MythriOfficial) December 7, 2024 ఇది కూడా చదవండి: ముక్కలయ్యేందుకు సిద్ధంగా కూటమి..హ్యాండ్ ఇస్తున్న మిత్ర పక్షాలు పక్కన ఉన్న ప్రేక్షకులు వారి వచ్చి వారిని శాంతింపజేశారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్స్ ను మైత్రీ మూవీ మేకర్స్ స్వయంగా తమ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఆ వీడియోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన ఆడియన్స్ గంగమ్మ తల్లీ అవతారంలో బన్నీ చేసిన తాండవానికి ఇలా పూనకాలు రావడం మాములే అని కామెంట్స్ చేస్తున్నారు. రెండు రోజుల్లో 500 కోట్లు.. పుష్ప2 రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 449 కోట్ల వసూళ్లను కలెక్ట్ చేసినట్లు తెలిపారు. అత్యంత వేగంగా రూ. 500 కోట్ల మార్క్ ను చేరుకున్న భారతీయ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా పోస్టర్ షేర్ చేశారు. ఇది కూడా చదవండి: కేసీఆర్ కు ఆహ్వానం అందించిన మంత్రి పొన్నం..!