టాలీవుడ్ లో పెళ్లి సందD, ధమాకా సినిమాలతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన శ్రీలీల ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది. గత ఏడాది ఏకంగా అరడజనుకు పైగా సినిమాలు చేసింది. కానీ ఆ సినిమాలేవీ సక్సెస్ కాలేదు. ఈ ఏడాది మహేష్ తో యాక్ట్ చేసిన 'గుంటూరు కారం' కూడా అనుకున్న స్థాయిలో ఆడలేదు. దీంతో శ్రీలీల పని అయిపోయింది అని అంతా అనుకున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో ఆమెకు "పుష్ప 2" లో ఐటెం సాంగ్ చేసే ఛాన్స్ వచ్చింది. శ్రీలీల చేసిన ఫస్ట్ ఐటెం సాంగ్ ఇది. ఈ పాట చేయడం శ్రీలీలకి బాగానే కలిసొచ్చింది. ప్రెజెంట్ "కిసిక్" అనే పదం దేశవ్యాప్తంగా ఓ ఊపు ఊపేస్తోంది. నార్త్ లో కూడా శ్రీలీల పేరు మార్మోగుతుంది. నో ఐటం సాంగ్స్.. దీంతో శ్రీలీలకు బాలీవుడ్ లో ఐటెం సాంగ్స్ చేయాలంటూ ఆఫర్స్ వస్తున్నాయట. ఈ క్రమంలో శ్రీలీల ఇక నుంచి ఐటెం సాంగ్స్ చేయకూడదని డిసైడ్ అయ్యిందట. బాలీవుడ్లో యంగ్ హీరోల సరసన హీరోయిన్ గా చేసే ఛాన్స్ వస్తే చాలని, టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ వచ్చినా అది హీరోయిన్ గా అయితే ఓకే కానీ, ఐటెం సాంగ్స్ అయితే చేయనని నిర్మాతలకు నిర్మొహమాటంగా చెప్పేస్తుందట. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఇక శ్రీలీల త్వరలోనే నితిన్ 'రాబిన్ హుడ్' సినిమాతో ఆడియన్స్ ముందుకు రానుంది. డిసెంబర్ 20న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ మూవీతో పాటూ రవితేజతో 'మాస్ జాతర', పవన్ కళ్యాణ్ తో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలు చేస్తోంది.