Daaku Maharaj: 'డాకు మహారాజ్' థియేటర్ లో పగిలిపోయిన సౌండ్ బాక్సులు.. సినిమా నిలిపివేత

'డాకు మహారాజ్' సౌండ్ ఎఫెక్ట్స్ కు ఓ థియేటర్ లో సౌండ్ బాక్సులు పగిలిపోయాయి. దీంతో థియేటర్ యాజమాన్యం కొద్ది సేపటి వరకు సినిమాను నిలిపివేశారు. రాయలసీమలోని ఆళ్లగడ్డ లో ఉన్న రామలక్ష్మి థియేటర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 

New Update
daaku maharaj screening

daaku maharaj screening

డైరెకర్ బాబీ, నందమూరి బాలకృష్ణ కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'డాకూ మహారాజ్'. నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సూపట్ హిట్ టాక్ తో దుమ్మురేపుతోంది. సినిమాలో బాలయ్య ఎప్పటిలాగే తన పవర్ ఫుల్ డైలాగ్స్, యాక్షన్ తో కుమ్మేశాడని ఫ్యాన్స్ చెబుతున్నారు. థమన్‌ బీజీఎం మాములుగా లేదు.. బాక్సులు బద్దలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

అయితే తాజాగా ఈ సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్ లో ఓ ఉహించని సంఘటన చోటు చేసుకుంది. సినిమాలో థమన్ బీజియంకి  నిజంగానే సౌండ్ బాక్సులు పగిలిపోయాయి. దీంతో థియేటర్ యాజమాన్యం కొద్ది సేపటి వరకు సినిమాను నిలిపివేశారు. ఏపీ రాయలసీమలోని ఆళ్లగడ్డ లో ఉన్న రామలక్ష్మి థియేటర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. 

ఇది కూడా చూడండి: Champions Trophy 2025 : టీమిండియాకు బిగ్ షాక్ .. బుమ్రా ఔట్!

'డాకు మహారాజ్' సౌండ్ ఎఫెక్ట్స్ కు థియేటర్ లో ఉన్న సౌండ్ స్పీకర్లు పని చేయకపోవడంతో దాదాపు 15 నిమిషాల పాటూ సినిమాను నిలిపివేశారు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. కాసేపటి తర్వాత థియేటర్ యాజమాన్యం యథావిధిగా సినిమాను స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 

ఈ ఒక్క చోటే కాదు.. చాలా చోట్ల 'డాకు మహారాజ్' సౌండ్ ఎఫెక్ట్స్ కు స్పీకర్లు పగిలిపోయానని ఫ్యాన్స్ నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నారు. నిజానికి సినిమా రిలీజ్ కు ముందు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. రేపు సినిమా రిలీజ్ అయ్యాక డాకు మహారాజ్ సౌండ్ ఎఫెక్ట్స్ కి థియేటర్స్ లో ఉన్న స్పీకర్లు పగిలిపోతాయి. ముందే చెప్తున్నా. కాబట్టి ముందే చెక్ చేసుకోండి. తర్వాత ఏం జరిగినా నన్ను అనొద్దు..అని చెప్పాడు. ఆ వీడియోను కూడా బాలయ్య ఫ్యాన్స్ నెట్టింట షేర్ చేస్తున్నారు.

ఇది కూడా చూడండి: Sankranthi Muggulu 2025: భోగి పండగకు ఈజీగా కుండల డిజైన్స్ .. 5 నిమిషాల్లోనే వేయిండిలా!

Advertisment
తాజా కథనాలు