Vishal: ఆరోగ్యంపై వార్తలు.. ఎట్టకేలకు నోరు విప్పిన విశాల్

'మద గజ రాజ’ ప్రీమియర్ కు హాజరైన విశాల్..తాను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని స్పష్టం చేశారు. ప్రస్తుతం నాకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. ఇప్పుడు నా చేతులు బాగా పనిచేస్తున్నాయి, మైక్ కూడా సులభంగా పట్టుకోగలుగుతున్నాను. మీప్రేమాభిమానాలకు ధన్యవాదాలు అంటూ తెలిపారు.

New Update
vishal about his health

kollywood actor vishal

కోలీవుడ్ హీరో విశాల్ ఆరోగ్యం గురించి ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గా 'మదగజరాజ' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి విశాల్ రాగా.. అత‌డి మొహం వాచి ఉండ‌డం.. చేతులు వ‌ణ‌క‌డం చూసి విశాల్ అభిమానులు కంగారుప‌డ‌డంతో పాటు ఆందోళ‌న చెందారు. 

ఇక సోషల మీడియాలో విశాల్ హెల్త్ పై రకరకాల రూమర్స్ వినిపించాయి. ఎట్టకేలకు విశాల్ తన హెల్త్ పై స్పందించారు. శనివారం సాయంత్రం ‘మద గజ రాజ’ ప్రీమియర్ ఈవెంట్‌లో పాల్గొన్నఆయన.. తాను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని స్పష్టం చేశారు.

Also Read : 'డాకు మహారాజ్' థియేటర్ లో పగిలిపోయిన సౌండ్ బాక్సులు.. సినిమా నిలిపివేత

"మా నాన్న నాకు ఎంతో ఇష్టం. ఆయన వల్లనే జీవితంలో ధైర్యంగా ఉండగలిగాను. ఎలాంటి కష్టాలు వచ్చినా వాటిని జయించగలిగాను. ఇప్పుడు ఈ విషయాన్ని చెబుతున్నదానికి ఓ కారణం ఉంది. కొంతమంది, నేను మూడు లేదా ఆరు నెలలకొకసారి సినిమాలకు విరామం తీసుకుని ఎక్కడికో వెళ్లిపోతున్నానని అంటున్నారు. కానీ, ప్రస్తుతం నాకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. 

ఇప్పుడు నా చేతులు బాగా పనిచేస్తున్నాయి, మైక్ కూడా సులభంగా పట్టుకోగలుగుతున్నాను. మీరు చూపించిన ప్రేమాభిమానాలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా తుది శ్వాస వరకూ మీ అభిమానాన్ని మర్చిపోను. ‘గెట్ వెల్ సూన్’, ‘కమ్ బ్యాక్’ అంటూ మీరు పంపిన సందేశాలు నాకు మరింత శక్తినిచ్చాయి," అని విశాల్ భావోద్వేగంగా అన్నారు. ఈ ఈవెంట్‌లో విశాల్ పూర్తిగా ఆరోగ్యంగా, ఫిట్‌గా కనిపించడం అభిమానులను మరింత ఆనందపరిచింది.

ఇది కూడా చూడండి: Champions Trophy 2025 : టీమిండియాకు బిగ్ షాక్ .. బుమ్రా ఔట్!

Advertisment
Advertisment
తాజా కథనాలు