బాలయ్య మీద కేసు పెడతా | Daku Maharaj Public Talk | Daku Maharaj Review | Balakrishna | RTV
బాలయ్య 'డాకు మహారాజ్' నేడు థియేటర్స్ లో రిలీజై హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మూవీటీమ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో నిర్మాత నాగవంశీ..'డాకు మహారాజ్' ఫ్రీక్వెల్ చేయాలని అనుకుంటున్నాం. ప్రీక్వెల్ కోసం ఓ ఐడియా కూడా ఉందని అన్నారు.
'డాకు మహారాజ్' విడుదల వేళ అభిమాని స్వయంగా బాలయ్యకు ఫోన్ చేసి సినిమాకి వస్తున్న రెస్పాన్స్ గురించి మాట్లాడారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఫోన్ కాల్ లో చాలా సంతోషంగా ఉందని, ఇదంతా ప్రేక్షకుల ఆశీస్సుల వల్లే అని, అభిమానులే నా బలం అంటూ చెప్పారు.
బాలయ్య 'డాకు మహారాజ్' థియేటర్స్ లో హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ మూవీ ఓటీటీ గురించి అప్పుడే డిస్కషన్ స్టార్ట్ అయింది. 'డాకు మహారాజ్' ఓటీటీ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. ఫిబ్రవరి లాస్ట్ వీక్ నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
నేడు థియేటర్స్ లో విడుదలైన 'డాకూ మహామహరాజ్' మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంటుంది. కొంతమంది సూపర్ అనగా.. అయితే మరికొంతమంది మాత్రం సినిమాలో బాలయ్య యాక్టింగ్ తప్పా కథేమీ లేదు.. రొటీన్ రొట్టా స్టోరీ అని అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
'డాకు మహారాజ్' సౌండ్ ఎఫెక్ట్స్ కు ఓ థియేటర్ లో సౌండ్ బాక్సులు పగిలిపోయాయి. దీంతో థియేటర్ యాజమాన్యం కొద్ది సేపటి వరకు సినిమాను నిలిపివేశారు. రాయలసీమలోని ఆళ్లగడ్డ లో ఉన్న రామలక్ష్మి థియేటర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.