/rtv/media/media_files/2025/02/13/WoX1wgmO8QCk6uMvX2Hv.jpg)
Rehman about ranveer allahbadia
AR Rahman: యూట్యూబర్ రన్వీర్ అల్లబాడియా(Ranveer Allahbadia) ఇటీవలే ఓ కామెడీ షోలో చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ప్రముఖుల నుంచి సామాన్యులు వరకు రన్వీర్ తీరుపై మండిపడ్డారు. అయితే తాజాగా దీనిపై ఆస్కార్ విజేత, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ పరోక్షంగా స్పందించారు.
Also Read: REVANTH BHIMALA: ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫేం బుల్లి రాజు తండ్రి పోలీస్ కంప్లైంట్.. సంచలన పోస్ట్!
నోరు మూసుకో..
ఇటీవలే జరిగిన 'చావా' మూవీ కార్యక్రమంలో హీరో విక్కీ కౌశల్.. తన సంగీతం గురించి మూడు ఎమోజీలలో వివరించమని ఎఆర్ రెహమాన్‌ను అడిగారు. దీనికి రెహ్మాన్ 'నోరు మూసుకున్న' ఎమోజీని చూపించారు. ఆ తర్వాత సరదాగా ఇలా అన్నారు.. నోరు తెరిస్తే ఏమి జరుగుతుందో మనం గత వారం చూశాం కదా అని విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. దీంతో కార్యక్రమంలో ఉన్నవారంతా గట్టిగా నవ్వారు. యూట్యూబర్ రన్వీర్ అల్లబాడియాను ఉద్దేశించే రెహ్మాన్ ఇలా చెప్పినట్లుగా అందరూ అనుకుంటున్నారు.
Also Read : ముందుకూ, వెనక్కూ ఊగిసలాడుతున్న స్టాక్ మార్కెట్లు
#ARRahman hilariously refers to #RanveerAllahbadia's #IndiasGotLatent controversy.🤐#FilmfareLens pic.twitter.com/zNwRoQgTSU
— Filmfare (@filmfare) February 12, 2025
రన్వీర్ అల్లబాడియా 'ఇండియాస్ గాట్ లాటెంట్' షోలో తల్లిదండ్రుల శృంగారంపై చేసిన అభ్యంతరకర జోకులు వేశారు. షోకు వచ్చిన ఓ మహిళా కంటెస్టెంట్ ను '' మీ తల్లిదండ్రులు వారి జీవితాంతం సెక్స్ చేయడం ప్రతిరోజూ నువ్వు చూస్తావా ? లేదా ఓసారి వాళ్లతో కలిసి దీన్ని శాశ్వతంగా ఆపేస్తావా ?'' అని అన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రన్వీర్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత అతడు క్షమాపణలు చెబుతూ ఒక వీడియోను కూడా రిలీజ్ చేశాడు. దీనికి సంబందించిన షో జడ్జ్ సమయ్ రైనా, రణవీర్, అపూర్వ సహా 6 మందిపై ముంబైలో ఫిర్యాదు నమోదైంది. అంతేకాదు షో ద్వారా అశ్లీలతను వ్యాప్తి చేసినందుకు 'ఇండియాస్ గాట్ టాలెంట్' బృందంపై కేసు నమోదు చేసినట్లు అస్సాం ముఖ్యమంత్రి తెలియజేశారు.
Also Read: Kiccha Sudeep: హైదరాబాద్ మెట్రోలో హీరో కిచ్చా సుదీప్.. అక్కడ ఏం చేశారో చూడండి?
Also Read: ఏసీబీ వలలో అవినీతి తిమింగలం.. దుబ్బాక రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ అరెస్ట్