బిగ్ బాస్ రియాల్టీ షోను ప్రజలు ఎక్కువగా వీక్షిస్తుంటారు. ఈ షోపై ప్రజల నుంచి ఎక్కువగానే అభ్యంతరాలు వచ్చాయి. కానీ అంతకంటే ఎక్కువగా బిగ్‌బాస్‌కి ఆదరణ పెరుగుతోంది. అయితే బిగ్‌బాస్ రియాల్టీ షోలో అసభ్యత, అశ్లీలత ఉందని, యువతను తప్పుదారి పట్టేంచే విధంగా ఉన్నాయని సామాజిక కార్యకర్త, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరెడ్డి 2019, 2022ల్లో ఏపీ హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఇది కూడా చూడండి: SM Krishna: కర్ణాటక మాజీ సీఎం కన్నుమూత అసభ్యకరమైన సన్నివేశాలు ఉన్నాయని.. అసభ్యకరమైన సన్నివేశలు ఉన్నాయని, బిగ్ బాస్ రియాల్టీ షోని రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల లోపల ప్రసారం చేయాలన్నారు. ఇతను చేసిన వ్యాజ్యాలపై ఏపీ హైకోర్టు తుది తీర్పును ప్రకటించింది. చట్ట నిబంధనల ప్రకారం ఈ షోపై అభ్యంతరాలు చెప్పడానికి ఎన్నో మార్గాలున్నాయని వాటిని వినియోగించాలని ఏపీ హైకోర్టు తెలిపింది. ఇది కూడా చూడండి: అలా చేస్తే కఠిన చర్యలు.. రాష్ట్ర సర్కార్ హెచ్చరిక! బిగ్ బాస్ రియాల్టీ షోని పూర్తిగా నిలిపివేసే విషయంలో జోక్యం చేసుకోలేమని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. కేవలం కొన్ని ఫొటోలతో షోని నిలిపి వేయాలంటే కుదరని తెలిపింది. మీకు ఆ సన్నివేశాలు అసభ్యకరమని అనిపించవచ్చు.. కానీ ఎక్కువ మందికి అది కాదని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఇది కూడా చూడండి: బట్టలు ఆరేస్తుండగా.. విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి కొందరికి బిగ్ బాస్ నచ్చక కంప్లైంట్‌లు చేస్తున్నారు. కానీ షో రేటింగ్ మాత్రం తగ్గడంలేదు. ప్రతీ ఒక్కరూ బిగ్ బాస్ షోని చూస్తున్నారు. బిగ్ బాస్ రియాల్టీ షోపై ఎన్ని ఫిర్యాదులు వస్తున్న కూడా దేశంలో అన్ని భాషల్లో కూడా నడుస్తోంది. ఇది కూడా చూడండి: Road Accident: ముంబైలో ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం