RGV కి బిగ్ షాక్.. 'వ్యూహం' మూవీకి లీగల్ నోటీసులు!

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్ నెట్ భారీ షాక్ ఇచ్చింది. ఆయన తీసిన ‘వ్యూహం’ సినిమాకి లీగల్ నోటీసు ఇచ్చింది. వ్యూహం సినిమాకు ఫైబర్ నెట్‌ నుంచి రూ.1.15 కోట్లు అనుచిత లబ్ధి పొందారని నోటీసులో పేర్కొన్నారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..

New Update
rgv new year tweet

సెన్షేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్ నెట్ భారీ షాక్ ఇచ్చింది. ఆయన దర్శకత్వంలో 'వ్యూహం' అనే సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విషయంలో ఏపీ ఫైబర్ నెట్.. RGV  కి లీగల్ నోటీసు ఇచ్చింది. ఆయనతో పాటు అప్పటి ఫైబర్‌ నెట్ ఎండీ సహా పలువురికి నోటీసులు అందాయి. 

Also Read :  అల్లు అర్జున్ ఎఫెక్ట్. రాంచరణ్ కు రేవంత్ సర్కార్ ఊహించని షాక్!

Vyooham Movie - RGV

మ్యాటర్ ఏంటంటే.. ‘వ్యూహం’ సినిమా టీంతో ఫైబర్ నెట్ అగ్రిమెంట్ చేసుకొని రూ.2.15 కోట్లకి గాను 1.15 కోట్లు చెల్లించిందని చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. వ్యూస్ ప్రకారం డబ్బులు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారని.. అయితే ఫైబర్ నెట్ లో 'వ్యూహం' సినిమాకు కేవలం 1863 వ్యూస్ మాత్రమే ఉన్నాయని.. ఈ లెక్కన ఒక్కో వ్యూస్ కు రూ.11 వేలు చొప్పున చెల్లించినట్లు అయ్యిందని వివరించారు.

Also Read :  'పుష్ప2' ఓటీటీ రిలీజ్ పై మేకర్స్ క్లారిటీ.. థియేటర్స్ లో మాత్రమే అంటూ

 ఒక వ్యక్తి చూస్తే వంద రూపాయలు మాత్రమే ఇవ్వాలి.. కానీ రూ.11 వేలు చొప్పున ఇవ్వడంపై వివరణ కోరుతూ లీగల్ నోటీసులు ఇచ్చినట్లు చైర్మన్ జీవి రెడ్డి గారు ప్రకటనలో తెలిపారు. మరి దీనిపై రామ్ గోపాల్ వర్మ ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.

Also Read :  గోదారి గట్టు సాంగ్.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మూవీ టీం!

Also Read :  పెళ్లి తర్వాత 'బేబీ జాన్' తో బిజీ.. సోషల్ మీడియాలో కీర్తి ఫొటోలు!

Advertisment
Advertisment