విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ నుంచి రీసెంట్ గా రిలీజైన 'గోదారి గట్టు' సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఒకప్పటి ఫేమస్ సింగర్ రమణ గోగుల పాడిన ఈ సాంగ్ మ్యూజిక్ లవర్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటి వరకు యూట్యూబ్ లో ఈ పాట 35 మిలియన్ వ్యూస్ రాబట్టింది.
ఫుల్ వీడియో సాంగ్..
ఈ రెస్పాన్స్ పై ఆనందంగా ఉన్న మూవీ టీమ్ ఇదే ఊపులో ఏకంగా ఫుల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు 'గోదారి గట్టు' ఫుల్ వీడియో సాంగ్ ను ఈ రోజు సాయంతం 5:04 గంటలకు రిలీజ్ చేస్తామని ఎక్స్ వేదికగా వెల్లడించారు. మాములుగా సినిమా రిలీజ్ కు ముందు జస్ట్ లిరికల్ వీడియో వదులుతారు.
Celebrating the success of #SankranthikiVasthunam First Singe with the core team behind the 'Magical Melody of the season'❤️🔥
— Sri Venkateswara Creations (@SVC_official) December 21, 2024
Full Video Today at 5:04 PM💥
Watch #GodariGattu Here!
— https://t.co/lh9wTTqvGz#సంక్రాంతికివస్తున్నాం GRAND RELEASE WORLDWIDE ON 14th JANUARY, 2025.… pic.twitter.com/VC0VYByUER
Also Read : 'పుష్ప2' ఓటీటీ రిలీజ్ పై మేకర్స్ క్లారిటీ.. థియేటర్స్ లో మాత్రమే అంటూ
కానీ సంక్రాంతికి వస్తున్నాం' మూవీ టీమ్ మాత్రం అందుకు భిన్నంగా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేస్తుండటం విశేషం. బహుశా తమ సినిమాకి ఆడియన్స్ లో మరింత హైప్ రావాలని ఇలా చేస్తున్నారేమో. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ సినిమాను . శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. . జనవరి 14 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: Ap: ఏపీ మందుబాబులకు గుడ్‌న్యూస్.. భారీగా మద్యం ధరలు తగ్గింపు