ఆర్జీవీకి బిగ్ షాక్.. మరో కేసులో సీఐడీ నోటీసులు

రాం గోపాల్ వర్మకి ఏపీ సీఐడీ సీఐ తిరుమలరావు నోటీసులు పంపారు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా కొందరి మనోభావాలు దెబ్బతీసేలా తీశారని బండారు వంశీకృష్ణ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 10న గుంటూరు సీఐడీ కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు.

New Update
rgv new year tweet

rgv

దర్శకుడు రాంగోపాల్‌ వర్మ మెడకు ఉచ్చు బిగుస్తోంది. వరుస కేసులు ఆయనని వదలడం లేదు. అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో శుక్రవారం ఒంగోలు రూరల్‌ పోలీస్ స్టేషన్‌లో ఆర్జీవీ విచారణకు హాజరయ్యారు. దాదాపు 9 గంటల పాటు పోలీసులు అతన్ని ప్రశ్నించారు. అయితే ఈ సమయంలోనే మరో కేసు విషయంలో కూడా ఏపీ సీఐడీ నుంచి ఆర్జీవీకి నోటీసులు వెళ్లాయి.

ఇది కూడా చూడండి: Jeeth Adani: గుజరాతీ సంప్రదాయంలో వేడుకగా గౌతమ్‌ అదానీ చిన్న కుమారుడి వివాహం!

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా వల్ల..

ఈ నెల 10వ తేదీన గుంటూరు సీఐడీ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని సీఐడీ సీఐ తిరుమలరావు నోటీసులు పంపారు. 2019లో ఆర్జీవీ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాను తీశారు. కొందరు మనోభావాలు దెబ్బతీసే విధంగా సినిమా తీశారని గతేడాది తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు ఆర్జీవీకి ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఉన్నప్పుడే నోటీసులు ఇచ్చారు. ఈ కేసు విషయంలో ఆర్జీవీ విచారణకు వెళ్తాడో లేదో చూడాలి. 

ఇది కూడా చూడండి: Horoscope Today:నేడు ఈ రాశి వారికి ఆదాయం పదింతలు అవుతుంది...మీ రాశేనేమో చూసుకోండి మరి!

ఇదిలా ఉండగా మద్దిపాడు కేసు విషయంలో ఆర్జీవీ ఒంగోలు రూరల్ సీఐ కార్యాలయంలో విచారణకు వెళ్లారు. అయితే ఈ కేసులో కోర్టు ఆర్జీవీకి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయినా కూడా పోలీసు విచారణకు సహకరించాలని కోర్టు ముందుగానే ఆదేశించింది. దీంతో ఇవాళ పోలీసు విచారణకు ఆర్జీవీ హాజరయ్యారు. ఈ విచారణలో ఆర్జీవిని పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు