/rtv/media/media_files/2025/11/25/andhra-king-taluka-2025-11-25-12-48-51.jpg)
Andhra King Taluka
Andhra King Taluka:ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(Ram Pothineni) నటిస్తున్న తాజా చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ నవంబర్ 27, 2025న తెలుగు, కన్నడ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ చిత్రానికి మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. గత కొన్ని సినిమాల్లో ఆశించిన స్థాయి విజయాలు రాకపోయిన, ఈ సినిమా రామ్‌కు చాలా కీలకమైంది. హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది.
అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ Andhra King Taluka Advance Bookings
సినిమా టీమ్ అధికారికంగా బుక్స్ స్టార్ట్ అని ప్రకటించింది, అన్ని ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ట్రైలర్, పాటలు, ప్రమోషనల్ ఈవెంట్స్ చాలా మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో అడ్వాన్స్ టికెట్ అమ్మకాలు వేగంగా పెరుగుతున్నాయి. త్వరలోనే ప్రీమియర్ షో డీటైల్స్ కూడా ప్రకటించనున్నారు.
USA లో భారీ హైప్.. అమెరికాలో ఈ సినిమా దుమ్మురేపుతోంది. రిలీజ్‌కు ఇంకా రెండు రోజులు ఉన్నా, ఇప్పటికే USD 42,289 ప్రీమియర్ అడ్వాన్స్ సేల్స్ నమోదయ్యాయి.
- 176 లొకేషన్లు
- 332 షోలు
- 3,064 టికెట్లు సేల్స్
ఇది రామ్ సినిమాలలో USA సర్క్యూట్‌లో చాలా పాజిటివ్ సైన్. గతంలో ‘స్కందా’ సినిమా రామ్ కెరీర్‌లో హయ్యెస్ట్ ప్రీమియర్ కలెక్షన్ అయినా, ఇప్పుడు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఆ రికార్డ్‌ను సులభంగా అధిగమించే అవకాశం ఉందని ట్రేడ్ అంచనాలు వేస్తోంది. - Tollywood news updates
Also Read: ప్రభాస్ ‘స్పిరిట్’లో మరో బడా హీరో.. ఏకంగా ఆ సినిమాతో కనెక్షన్..?
కథలో ఏముంది?
ఈ చిత్రం ఫ్యాన్ కల్చర్ నేపథ్యంతో రూపొందింది. సినిమాలో రామ్ పోషించిన సాగర్ అనే యువకుడు, తన జీవితం, సంబంధాలు అన్నీ తన స్క్రీన్ ఐడల్ అయిన ‘ఆంధ్ర కింగ్- సూర్యకుమార్’ (ఉపేంద్ర) చుట్టూనే తిరుగుతాయి. సాగర్ తన అభిమానానికి ఏ స్థాయికి వెళ్తాడు? ఆ కారణంగా అతని జీవితంలో ఏమి మారుతుంది? అనేదే సినిమా కథ.
సపోర్టింగ్ కాస్ట్ సినిమాకు మరో బలం.. ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనుండగా,
- రాహుల్ రామకృష్ణ
- రావు రమేశ్
- మురళీ కృష్ణ
- రాజీవ్ కనకాల
- సత్య
Also Read: దుమ్ము రేపుతోన్న 'రాజు వెడ్స్ రాంబాయి' బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్.. 4 డేస్ కలెక్షన్స్ ఇదిగో!
ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతం వివేక్- మెర్విన్ అందిస్తున్నారు. నిర్మాణ బాధ్యతలు మైత్రి మూవీ మేకర్స్ నిర్వహిస్తున్నారు.
తాజాగా విడుదలైన ‘స్కందా’, ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాలు రామ్ నుండి ఆశించిన వసూళ్లు రాబట్టలేకపోయాయి. అయినప్పటికీ, రామ్ యంగ్ జనరేషన్‌లో మంచి క్రేజ్ కలిగిన స్టార్. ఈ సినిమా ఆయన కెరీర్‌కు మంచి మలుపు కావొచ్చని అభిమానులు నమ్ముతున్నారు.
‘ఆంధ్ర కింగ్ తాలూకా’కు మొదటి వారం ఫ్రీ రన్ ఉన్నప్పటికీ, డిసెంబర్ 5 నుంచి రణవీర్ సింగ్ ‘ధురంధర్’, బాలకృష్ణ ‘అఖండ 2’ వంటి భారీ సినిమాలతో పోటీలో నిలవాల్సి ఉంటుంది.
Follow Us