యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి కాంబోలో వస్తున్న అనగనక ఒకరాజు సినిమా ప్రీ వెడ్డింగ్ వీడియో విడుదలైంది. ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. నేడు నవీన్ పొలిశెట్టి పుట్టిన రోజు కావడంతో మూవీ టీం ఈ ప్రీ వెడ్డింగ్ వీడియోను విడుదల చేసింది. రేయ్ ఇది రాజుగారి పెళ్లి అందరికి కూడా బంగారు ప్లేట్లే పెట్టండండి.. కాజు కత్లీపై సిల్వర్ ఫాయిల్ ఎందుకు వేశారు.. బంగారం ఫాయిల్ ఉండాలి.. ఇది రాజు కత్లీ అని.. చమ్మక్ చంద్రతో వీడియో ప్రారంభం అవుతుంది. ఇది కూడా చూడండి: బెనిఫిట్ షోలు చిన్న పార్ట్.. సీఎం మాకు ఏం చెప్పారంటే.. దిల్ రాజు సంచలన ప్రెస్ మీట్! Jaanejigars… Here is the PRE WEDDING VIDEO of #AnaganagaOkaRaju. A small video introducing the madness of Raju and our lovely team 🤗There"s loads of fun and love coming your way!💥💥So so happy to be back to entertain you all 🤗🤗Promising you all another great experience in… pic.twitter.com/wEIN4f0sR0 — Naveen Polishetty (@NaveenPolishety) December 26, 2024 ఇది కూడా చూడండి: బన్నీపై నాకు కోపం లేదు.. మేం కలిసి తిరిగాం.. రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్! ముకేశ్ మావయ్య అంటూ.. ఆ తర్వాత నవీన్ పొలిశెట్టి ముకేశ్ మావయ్యతో వీడియో కాల్ మాట్లాడుతూ.. మావయ్య నీకు వంద రీఛార్జ్‌లు అంటూ స్టార్ట్ చేసి.. అనంత్ వెడ్డింగ్ క్యాసెట్ చూస్తున్నా అని దాని గురించి మాట్లాడతాడు. మరోసారి నవీన్ పొలిశెట్టి తన కామెడీ, యాక్టింగ్‌తో చించేశాడు. ప్రీ వెడ్డింగ్ వీడియో అదిరిందని.. మళ్లీ హిట్ కొట్టడం పక్కా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇది కూడా చూడండి: Virat Kohli: కోహ్లీకి బిగ్ షాక్.. ఢీకొట్టినందుకు భారీ ఫైన్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతోనే హీరోగా ఇండ్రస్టీకి ఎంట్రీ ఇచ్చాడు. తన నటనతో సూపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత అనుదీప్‌తో జాతిరత్నాలు, లేడీ స్టార్ అనుష్కతో మిస్టర్ శెట్టి.. మిసెస్ పోలిశెట్టి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టాడు. అనారోగ్యం కారణంగా కాస్త గ్యాప్ తీసుకున్న నవీన్ ఇప్పుడు అనగనగా ఒకరాజు అనే సినిమాతో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇది కూడా చూడండి: CM Revanth Reddy: సీఎం రేవంత్ నోట తగ్గేదే లే మాట.. సినీ పెద్దలతో ఏమన్నారంటే?