/rtv/media/media_files/2025/11/22/amrutham-serial-2025-11-22-13-18-55.jpg)
Amrutham Serial
Amrutham Serial: ఎప్పటికీ మరిచిపోలేని సీరియల్స్‌లో అమృతం ఒకటి. "ఒరేయ్ ఆంజనేలూ…" అంటూ మొదలయ్యే ఆ టైటిల్ సాంగ్ ఇప్పటికీ మన అందరి చెవుల్లో మారుమోగుతూనే ఉంటుంది. 90ల పిల్లలకు అయితే ఆదివారం రాత్రి అంటే అమృతం టైం. కుటుంబం అంతా కలిసి కూర్చొని కడుపుబ్బా నవ్వుకునే రోజుల్ని ఈ సీరియల్ మళ్లీ గుర్తుచేయబోతోంది.
Also Read: 'ఇలా చేస్తే పైరసీ పూర్తిగా ఆపేయొచ్చు'.. ఆర్జీవీ చెప్పిన సొల్యూషన్!
Amrutham Serial Is Back On YouTube
తాజాగా అమృతం టీమ్ ఈ ఆనందకరమైన వార్తను ప్రకటించింది. ఇప్పుడు ఈ సీరియల్ యూట్యూబ్ ద్వారా మరోసారి అభిమానుల ముందుకు రాబోతోంది. నవంబర్ 24 నుంచి ప్రతి రోజు రెండు ఎపిసోడ్‌లు అధికారిక అమృతం సీరియల్ ఛానెల్‌లో రిలీజ్ కానున్నాయి. ఇందుకు సంబంధించిన ఒక ట్రైలర్ కూడా విడుదల చేయడంతో అభిమానుల్లో పాత జ్ఞాపకాలు మళ్లీ గుర్తుచేసుకుంటున్నారు.
Also Read: "ఈ రెబల్ సాబ్ యూట్యూబ్ ని షేక్ చేస్తాడు" తమన్ గూస్ బంప్స్ ఎలివేషన్!
అమృతం సీరియల్‌లో టైటిల్ పాత్ర అయిన అమృతరావుగా మొదట శివాజీ రాజా నటించారు. తర్వాత ఆ పాత్రను నరేశ్ పోషించి మంచి స్పందన అందుకున్నారు. కొంతకాలానికి హర్షవర్ధన్ అదే రోల్‌లో కనిపించి మరోసారి నవ్వులు పంచారు. ఈ షోలో గుండు హనుమంతరావు ‘సరస్వతి నీలం’గా, రాగిణి ‘సరస్వతి’గా నటించి ప్రేక్షకులమనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు.
Also Read: కీరవాణి భారీ మ్యూజికల్ అప్‌డేట్ - ‘వారణాసి’లో మొత్తం ఎన్ని పాటలంటే?
ప్రతి ఎపిసోడ్‌లోనూ వచ్చే రోజు వారీ కామెడీ, పంచులు, అమృతం-అన్జనీళ్లు మధ్య జరిగే చిన్న చిన్న హాస్య సన్నివేశాలు ఈ సీరియల్‌ను ఒక మధుర జ్ఞాపకంగా మార్చాయి. యూట్యూబ్ ద్వారా మళ్లీ అందుబాటులోకి రాబోతుండడంతో అమృతం అభిమానులు పాత రోజుల వినోదాన్ని మళ్లీ ఆస్వాదించేందుకు రెడీగా ఉన్నారు. ప్రతి రోజు రెండు ఎపిసోడ్‌లు రావడం అభిమానులకు డబుల్ ట్రీట్ అని చెప్పాలి!
Follow Us