/rtv/media/media_files/2024/12/23/ljbOp1ieJU9BjbcYiwdC.jpg)
tsfc on sandhya theatre issue
సంధ్య థియేటర్ ఘటన ఓవైపు అల్లు అర్జున్ కు ఉచ్చులా బిగుసుకుంటే ఇదే ఘటనపై తెలంగాణ ఫిలిం ఛాంబర్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సంధ్య థియేటర్ ఘటనలో బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు విరాళాలు సేకరించేందుకు ముందుకొచ్చింది.
ఈ ఘటనలో రేవతి అనే మహిళ మరణించగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ మాత్రం ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఆ బాలుడ్ని ఆదుకునేందుకు ఇండస్ట్రీ సభ్యులు ముందుకు రావాలని ఫిలిం ఛాంబర్ పిలుపునిచ్చింది. ఇందుకు సంబంధించి తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధికారిక ప్రకటన చేసింది.
Telangana State Film Chamber of Commerce #TSFCC pic.twitter.com/SsOpdUVRKi
— Telugu Film Producers Council (@tfpcin) December 23, 2024
Also Read : ఒకే వేదికపై బాలయ్య, ఎన్టీఆర్.. ఫ్యాన్స్ కు పండగే
అయితే దీనిపై నెటిజన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఘటన జరిగిన తర్వాత ఇన్ని రోజులకైనా ఫిలిం ఛాంబర్ ఓ మంచి పని చేసేందుకు ముందుకు వచ్చిందని, ఈ మేరకు ఇండస్ట్రీకి చెందిన ప్రతీ ఒక్కరూ విరాళాలు ఇస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పుష్ప 2’ ప్రీమియర్ షో చూసేందుకు హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన్ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. రేవతి అనే మహిళ మృతి చెందారు. ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఈ ఘటనపై స్పందించిన అల్లు అర్జున్.. బాధిత కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. అంతేకాకుండా బాలుడు పూర్తిగా కోలుకునేవరకు అతనికి సంబంధించిన వైద్య ఖర్చులు కూడా తానే భరిస్తానని మాటిచ్చాడు. అలాగే వాళ్ళ ఫ్యామిలీకి ఏ ఆపద వచ్చినా నేను తోడుగా ఉంటానని చెప్పాడు.