అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటన పీక్స్ కు చేరింది. ఇటీవల అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పై ఆరోపణలు చేయడం ఒకెత్తు అయితే.. అందుకు కౌంటర్ గా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం మరో ఎత్తు. ప్రెస్ మీట్ లో ఘటన జరిగిన టైం లో పోలీసులు తనకు ఏమీ చెప్పలేదని అన్నారు. అదే అతని కొంప ముంచింది. బన్నీ చెప్పింది అబద్దం అని, పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ మరీ రిలీజ్ చేసి చెప్పారు. దాంతో సోషల్ మీడియాలో అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ లాగా మారిపోయింది. ఈ వివాదంలో అల్లు అర్జున్ పైనే ఎక్కువ నెగిటివిటీ వస్తోంది. దానికి తోడు నిన్న అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ళ దాడి కూడా జరిగింది. Also Read : ఒకే వేదికపై బాలయ్య, ఎన్టీఆర్.. ఫ్యాన్స్ కు పండగే అల్లుడి కోసం రంగంలోకి చిరు.. ఓయూ జేఏసీ స్టూడెంట్స్ అంటూ కొందరు బన్నీ ఇంటి గేటు దూకి బౌన్సర్ల తో గొడవ పెట్టుకొని నానా రచ్చ చేశారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడప్పుడే సర్దు మణిగేలా కనిపించడం లేదు. అయితే ఈ వివాదంలో అల్లు అర్జున్ ను గట్టెక్కించేందుకు మెగాస్టార్ రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. బన్నీ ఇంటిపై దాడి జరిగిన అనంతరం అల్లు అరవింద్ చిరంజీవితో మాట్లాడినట్లు సమాచారం. తన కొడుకును ఎలాగైనా ఈ వివాదం నుంచి బయటకు తీసుకువచ్చేలా చూడమని చిరును కోరినట్లు తెలుస్తోంది. దీంతో చిరంజీవి ఇండస్ట్రీ పెద్దగా రంగంలోకి దిగి తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి గొడవను సర్దుమణిగేలా చేయనున్నట్లు ఇండస్ట్రీ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. Also Read: అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. స్పందించిన సీఎం రేవంత్ దీంతో పాటూ ఇక నుంచి సినిమాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వదని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పడం పెద్ద సినిమాలకు ఆటంకంగా మారనుంది. దీంతో బడా నిర్మాతలంతా ఈ విషయంలో చిరంజీవిని చొరవ తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీటన్నింటిపై మెగాస్టార్ త్వరలోనే తెలంగాణ సీఎంను కలవనున్నట్లు సమాచారం.