/rtv/media/media_files/2024/12/15/isTsRf0XxlwZKuKohviQ.jpg)
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్.. నేడు మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం మధ్యాహ్నం చిరంజీవి నివాసానికి వెళ్లారు బన్నీ. చిరు కుటుంబంతో సుమారు గంటపాటు సమయం గడిపారు. ఈ క్రమంలో బన్నీ ఫ్యామిలీతో చిరంజీవి దిగిన ఫొటో బయటికొచ్చింది.
Also Read: ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీకి తప్పిన ప్రమాదం
Boss & Bunny #AlluArjun #Chiranjeevi 📸 pic.twitter.com/VuNNvAo0sj
— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) December 15, 2024
Also Read: నేడే ‘బిగ్ బాస్-8’ లాస్ట్ డే.. 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు!
ఒక్క ఫొటోతో విభేదాలకు చెక్..
ఈ ఒక్క ఫొటో ఇన్నాళ్లు మెగా - అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాలంటూ వచ్చిన వార్తలన్నినింటికి పులిస్టాప్ పడేలా చేసింది. ఈ ఫొటోను చూసిన ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తూ.. మీరు ఎప్పుడూ ఇలాగే కలిసుండాలని కోరుకుంటున్నట్లు నెట్టింట పోస్టులు పెడుతున్నారు. బన్నీ ఫ్యామిలీతో మెగాస్టార్ దిగిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.
Also Read : 2024లో లాంచ్ అయిన కిర్రాక్ ఫ్లాగ్ షిప్ ఫోన్లు.. మొత్తం ఎన్నంటే?
Actor Allu Arjun along with his family arrives at Megastar Chiranjeevi's residence in Hyderabad today.#AlluArjun #MegastarChiranjeevi #Chiranjeevi #AlluArjunArrested #Hyderabad #AlluArjunArrest pic.twitter.com/RXPN4ga5Mz
— Surya Reddy (@jsuryareddy) December 15, 2024
Also Read : 'బిగ్ బాస్- 8' గ్రాండ్ ఫినాలే ఈ రోజే.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో శుక్రవారం ఉదయం పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ రాత్రంతా ఆయన చంచల్‌గూడ జైలులో ఉన్నారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో శనివారం ఉదయం విడుదలయ్యారు. ఆ తర్వాత చిరంజీవి సతీమణి సురేఖ బన్నీ నివాసానికి వెళ్లి భావోద్వేగానికి గురైన సంగతి తెలిసిందే.